
Taati Munjalu : వేసవిలో దొరికే తాటిముంజలు నోరూరిస్తాయి. చూస్తేనే తినాలనిపిస్తుంది. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేచర్ ఇచ్చే వాటిలో అనేక లాభాలుంటాయి. వాటిని విడిచిపెట్టకుండా తినడమే మనం దానికి ఇచ్చే మర్యాద. ఇలా తాటి ముంజలు తెల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. చూస్తేనే నోరూరుతుంది. ఎప్పుడెప్పుడు నోట్లో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటాం. తాటిముంజలు తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఎండాకాలంలో మన శరీరం వేడిగా ఉంటుంది. ఎండల బారిన పడుతుంటాం కాబట్టి అధికంగా వేడి వస్తుంది. దీంతో మనం చలువ కోసం రకరకాల చర్యలు తీసుకుంటాం. నీళ్లు తాగుతుంటాం. ఎన్ని నీళ్లు తాగినా వేసవి కావడంతో దాహం తీరదు. ఒంట్లో వేడి తగ్గదు. ఈ నేపథ్యంలో తాటిముంజలు తింటే శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. వీటికి అంతటి మహత్తర శక్తి ఉంటుంది.
శరీరంలో నీటి శాతం తగ్గితే డీ హైడ్రేడ్ కు గురవుతుంది. అలా జరిగితే వడదెబ్బ ముప్పు పొంచి ఉంటుంది. దీన్ని రక్షించేందుకు తాటి ముంజలు పనికొస్తాయి. ఎండలో ఉన్నప్పుడు వీటిని తింటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వేసవి కాలంలో వీటిని క్రమం తప్పకుండా తింటూ ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది.
ఎండాకాలంలో జీర్ణక్రియ సాఫీగా సాగదు. అందుకే మనం తేలికగా ఉండే వాటినే తీసుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా తాటిముంజలు పనికొస్తాయి. మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. తిన్నది జీర్ణం కాకపోతే మలబద్ధకం సమస్య వస్తుంది. దీంతో ఇబ్బందులు తలెత్తుతాయి. తాటిముంజలు తింటే ఆ సమస్య రాకుండా పోతుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడమే ఉత్తమం. తాటిముంజలతో క్యాన్సర్ ను కూడా దూరం చేసుకోవచ్చు. ఇలా తాటిముంజలతో కలిగే లాభాలు తెలియడంతో వాటిని రెగ్యులర్ గా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.