beach Entry Fee in AP : ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ కొలువు దీరింది. విజనరీ సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరేవేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు శతవిధలా ప్రయత్నిస్తోంది.
అయితే వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పై లక్షల కోట్ల అప్పు భారం పడింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం పాత బకాయిల వడ్డీలను చెల్లించేందుకు నానా తంటాలు పడుతోంది. కేంద్రంలో మోదీ సర్కార్ ఏపీకి అండగా ఉండటంతో కొన్ని సంక్షేమ పథకాలైన కూటమి సర్కార్ అమలు చేస్తోంది.
మరోవైపు ఖజానాను పెంచేందుకు కూటమి సర్కార్ అనేక ప్రయత్నాలు మొదలెట్టింది. విజన్ 2047ను దృష్టి ఉంచుకొని సీఎం చంద్రబాబు సంపద సృష్టిపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ప్రజలపై భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
2025 జనవరి 1 నుంచి ఏపీలో బీచులకు ఎంట్రీ ఫీజును అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. రూ. 20 నుంచి రూ.30 వరకు వసూలు చేయాలని భావిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. బీచ్ కు ఎంట్రీ ఫీజు పెట్టడంపై వైసీపీ సోషల్ మీడియా అప్పుడే ట్రోల్స్, మీమ్స్ మొదలు పెట్టింది.
విజన్ 2047 కోసం… ఇప్పటి నుంచే బాబుగారు సంపద సృష్టి మొదలు పెట్టారు…జయము జయము చంద్రన్న.. అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన మీమ్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా వైసీపీ హయాంలో చెత్త పన్నుపై ఏ రేంజులో ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెల్సిందే. కూటమి హయాంలో బీచ్ పై పన్ను కూడా అలానే జరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కూటమి సర్కార్ ఈ నిర్ణయంపై ఎలా ముందుకెళుతుందనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
View this post on Instagram