27.5 C
India
Tuesday, December 3, 2024
More

    Hindu Culture : గర్భగుడిలోకి వెళ్లేముందు గడపకెందుకు నమస్కరిస్తారు

    Date:

    SRI KALA HASTI TEMPLE
    SRI KALA HASTI TEMPLE 

    Hindu Culture సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు.

    వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు? ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే…

    రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.

    అయితే, ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.

    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్నీ కాపాడుతుంది

     

    Share post:

    More like this
    Related

    Priyanka Gandhi : లోక్ సభలో ప్రియాంక గాంధీ సీటు నంబర్ ఏదో తెలుసా?

    Priyanka Gandhi : 18వ లోక్‌సభలో పార్లమెంటు స్థానాల కేటాయింపు ఖరారైంది. సోమవారం...

    Coldest Winter : కోల్డెస్ట్ వింటర్ గా 2024 డిసెంబర్

    Coldest Winter : 2024 డిసెంబర్ నెల చాలా చల్లగా ఉండబోతుంది....

    Pushparaj : పవన్ కల్యాణ్ కి థాంక్స్ చెప్పిన పుష్పరాజ్

    Pushparaj : డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ కానుంది. ఈ...

    Nagababu vs Allu arjun : అల్లు అర్జున్ కు నాగబాబు వార్నింగ్

    Nagababu vs Allu arjun : మెగా బ్రదర్ , జనసేన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Women for Hinduism : హిందూత్వం కోసం నాటి మహిళల త్యాగం మరువలేనిది..

    తమిళ మాసం వైకాసి సందర్భంగా శ్రీరంగంపై ఢిల్లీ జీహాడీ దురాక్రమణదారులు దాడి...

    Hinduism : హిందూత్వ స్పృహ

    Hinduism : "విశ్వ హిందూత్వం లేదా విశ్వ వ్యాప్తంగా భారతీయత పునర్భవం ఔతోంది......