beluga airbus బెలుగా ఎయిర్ బస్.. అకాశ విహంగంగా దీనికి పేరుంది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానం. . హైదరాబాద్ లో ని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు విచ్చేసింది. గత నెల 31న ఇది శంషాబాద్ రన్ వే పై ల్యాండ్ అయ్యింది. దీంతో విమానాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం పోటీ పడ్డారు. అతి పెద్ద తిమింగళం ఆకారాన్ని ఈ విమానం పోలి ఉంటుంది. సాధారాణ విమానం క్యాబిన్ కంటే నాలుగు రెట్లు అధికంగా దీని క్యాబిన్ ఉంటుంది. అయితే ఇది మనుషులను తీసుకెళ్లదు. కేవలం వస్తు సామగ్రికి మాత్రమే దీనిని వినియోగిస్తున్నారు. విమానాల విడిభాగాలు తీసుకెళ్లేందుకు కూడా ఈ విహంగాన్ని ఉపయోగిస్తుంటారు.
అతి పెద్దగా కనిపించే ఈ విమానం అరంతస్తుల ఎత్తు ఉంటుంది. ఇక దీని రెక్కలు 45 మీటర్ల వరకు ఉంటాయి. 1996 నుంచి ఇవి సేవలందిస్తున్నాయి. ఇలాంటి బెలుగా విమానాలు నాలుగు ఉన్నాయి. మొదటిసారిగా గతేడాది డిసెంబర్ లో తొలిసారిగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. అత్యవసర పరిస్థితి ఎదురవడంతో ల్యాండ్ కావాల్సి వచ్చింది. సాంకేతిక లోపం తలెత్తండంతో అత్యవసరంగాదించారు. అయితే ఆ సమయంలో బెలుగా 116 మీటర్ల జనరేటర్ ను తీసుకెళ్తున్నది. అయితే ఎయిర్ బస్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తుంది.
మొదటిసారిగా 1994 లో దీనిని తయారు చేశారు. అప్పటి నుంచి దీనిని అప్ డేట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చిన బెలుగా విమానంలో తొలిసారి ప్రయాణం జనవరి 2020లో ప్రారంభించింది. అయితే బెలుగా విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టు కు రావడంపై జీఎంఆర్ సంస్థతో పాటు ఎయిర్ పోర్టు సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.