
Eating an apple : రోజుకో యాపిల్ తింటే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. మనకు ఆరోగ్యాన్ని అందివ్వడంలో యాపిల్ ఎంతో ఉపకరిస్తుంది. దీంతో మనం రోజువారీ ఆహారంలో దీన్ని భాగంగా చేసుకోవడం ఉత్తమం. యాపిల్ తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మన శారీరక వ్యవస్థ మెరుగుపడుతుంది. రోగాలు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
యాపిల్ తినడం వల్ల కళ్లకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. జీర్ణశక్తి బాగుంటుంది. దీంతో మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం అవుతాయి. దీని వల్ల మనకు మలబద్ధకం సమస్య కూడా లేకుండా పోతుంది. ఇన్ని రకాల లాభాలున్నందున యాపిల్ ను మనం తింటూ ఉండాలి. రోగాలు రాకుండా కాపాడుకోవాలి.
యాపిల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే నష్టాలు వస్తాయి. అందుకే మంచి కొలెస్ట్రాల్ ను పెంచి గుండెకు రక్తసరఫరా బాగుండేలా చేస్తుంది. క్యాన్సర్ నిరోధానికి దోహదపడుతుంది. యాపిల్ తినడం వల్ల క్యాన్సర్ ముప్పు కూడా రాకుండా ఉంటుంది. అధిక బరువును తగ్గిస్తుంది. ఊబకాయం సమస్య రాకుండా చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
కాలేయంలో వ్యర్థాలను తొలగిస్తుంది. ఈ నేపథ్యంలో యాపిల్ తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. మతిమరుపును పోగొడుతుంది. వయసు పైబడిన వారికి వచ్చే ఈ వ్యాధిని అల్జీమర్స్ అంటారు. ఇది రాకుండా చేయడంలో యాపిల్ అడ్డుకుంటుంది. ఇలా యాపిల్ తో మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో దాగి ఉన్నాయి.






