
Eating mangoes : పండ్లల్లో రారాజు మామిడి. మామిడిని చూస్తేనే నోరూరుతుంది. దాని ఆకర్షణీయ రూపమే మనల్ని తినాలని ప్రేరేపిస్తుంది. సీజనల్ గా దొరికే పండు కావడంతో అందరు ఇష్టంగా తింటారు. అందుకే దీన్ని ఫలరాజం అని పిలుస్తుంటారు. ఇందులో ఉండే పోషకాలు కూడా అలాంటివే. దీంతో మామిడిని రోజు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీన్ని రోజు తింటూ మన దేహానికి మేలు కలిగించుకోవచ్చు.
జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మందికి తిన్నది త్వరగా జీర్ణం కావడం లేదు. దీంతో వారు మలబద్ధకం లాంటి సమస్యతో బాధపడుతున్నారు. మామిడి పండు తింటే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో మనకు అజీర్తి సమస్యలు ఉండవు. అందుకే దీన్ని తింటూ మన గ్యాస్ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ పుష్కలంగా ఉండటంతో కంటి జబ్బులు రాకుండా చేస్తుంది మామిడి పండు తింటే కళ్లకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. ఇలా సహజసిద్ధంగా దొరికే మామిడి పండు మన దేహానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీన్ని విరివిగా తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.
వడదెబ్బ తాకకుండా చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లతో మనకు నీటిశాతం తగ్గకుండా చేసి వడదెబ్బ ముప్పు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వయసులో వచ్చే మొటిమలకు కూడా మంచి మందులా పనిచేస్తుంది. అవి రాకుండా చేయడంలో సాయపడుతుంది. ఇలా మామిడి పండు మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తుందని తెలుసుకుని తింటూ ఉండాలి.