
Benefits of papaya : బొప్పాయి పండు చూస్తేనే తినాలనిపిస్తుంది. పోషకాలు మెండు. అందుకే దీన్ని అందరు తినడానికి ఇష్టపడతారు. పైత్యం తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. విటమిన్ సి, రిబో్లేవిన్ అధికంగా ఉండటంతో చక్కెర, ఖనిజ లవాణాలు ఉండటం వల్ల పైత్యం లేకుండా పోతుంది. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని కూరగా వండుకుని బాలింతలు తింటే చాలా మంచిదని చెబుతారు.
వంద గ్రాముల బొప్పాయిలో 60 నుంచి 126 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది చిగుళ్లలో వాపును నిరోధిస్తుంది. ఇందులో విటమిన్ డి కూడా ఉండటంతో సూర్యరశ్మి కన్నా అధికమైన విటమిన్ డి దీంతో లభిస్తుంది. తిన్న పదార్థాలు జీర్ణం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది. రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది.
క్షయవ్యాధి రాకుండా చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్త ప్రసరణ సరిగా జరిగేందుకు దోహదపడుతుంది. ముసలితనం రాకుండా అడ్డుకుంటుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. ఉదయం అల్పాహారంగా తీసుకుంటే ఎంతో మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ముక్కలను పాలతో పాటు తీసుకుంటే కాలేయ సంబంధమైన జబ్బులను దూరం చేస్తుంది.
బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని 10 గ్రాముల పొడి తీసుకుని ఒక కప్పు వేడి నీటిలో కలుపుని తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇలా బొప్పాయితో మనకు చాలా రకాల లాభాలున్నాయి. అందుకే బొప్పాయి పండుతో పాటు దాని ఆకులు కూడా ఆయుర్వేదంలో మందుగా మారుతాయి.