
Benefits of walking every day : మనం ఆరోగ్యం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. ఆహారం దగ్గర నుంచి ఔషధాల వరకు జాగ్రత్తలు పాటిస్తున్నాం. జబ్బులు రాకుండా ఉండాలంటే మనం కొన్ని పనులు చేయాలి. ఉదయం, సాయంత్రం నడక ద్వారా మనకు ఎన్నో అరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో మనం క్రమం తప్పకుండా నడక కొనసాగించాలి. ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల మనకు మంచి లాభాలుంటాయి.
మధుమేహం ఉంటే అది అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా చేస్తుంది. దీంతో షుగర్ పేషెంట్లకు చాలా ప్రయోజనం. నడక వల్ల ఇంకా అనేక రకాల మేలు కలుగుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఇంకా పలు రకాల వ్యాధులు రాకుండా చేయడంలో నడక చాలా ఉపయోగపడుతుంది. దీంతో నడక రోజు చేయడం మంచి అలవాటు.
ఉదయంతో పాటు సాయంత్రం భోజనం చేసిన తరువాత ఓ అరగంట పాటు వాకింగ్ చేస్తే మనం తిన్న పదార్థాలు త్వరగా జీర్ణం అవుతాయి. దీంతో మంచి నిద్ర పడుతుంది. ఇలా నాలుగడుగులు వేస్తే మన ఆయుష్షు కూడా పెరుగుతుంది. జబ్బుల నుంచి ఉపశమనం కలుగుతంది. ఇలా వాకింగ్ మన జీవితంలో ఎంతో మార్పు తీసుకొస్తుంది.
నడిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ ఉన్న వారు షూలు లేకుండా నడవొద్దు. ఇతరులైతే చెప్పులు విడిచి వట్టి కాళ్లతో నడిస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. నడుస్తున్నప్పుడు అడుగులు క్రమం తప్పకుండా వేయాలి. చదునుగా ఉండే నేల అయితే బాగుంటుంది. ఉదయం పరగడుపున నడవొద్దు. ఏదైనా తిని నడిస్తే మంచిది. దీంతో రక్తంలో గ్లూకోజు లెవల్స్ పడిపోకుండా ఉంటాయి.