
Seema chintakaya : ఎండాకాలంలో లభించే కాయల్లో సీమ చింతకాయ ఒకటి. దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ప్రాంతానికో రకంగా అంటారు. తెలంగాణలో పులిచింతకాయ అని మిగతా ప్రాంతాల్లో తొలి చింతకాయ అని సంబోధిస్తుంటారు. ఇంకా కొన్ని ప్రదేశాల్లో దీన్ని గుబ్బ కాయలని కూడా పిలుస్తుంటారు. ఇందులో పాస్పరస్, ఐరన్, కాల్షియం, విటమిన్ సి, నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి.
సీమ చింతలో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇందులో ఉండే పొటాషియంతో గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రొమ్ము క్యాన్సర్ కణాల సంఖ్యను తగ్గించడంలో సాయపడుతుంది. దీని ఆకుల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కడుపులో ఉండే ఫ్రీ రాడికల్స్, టాక్సిన్లను తొలగించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అనేక రకాల వ్యాధుల నివారణకు ఇది దోహదపడుతుంది. అందుకే దీన్ని దొరికినప్పుడే బాగా తినాలి.
సీమ చింతకాయలో విటమిన్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటంతో కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఇలా సీమ చింతకాయలతో అనేక లాభాలు ఉండటం వల్ల ఎండాకాలంలో మాత్రమే దొరికే వీటిని తినడం మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.