
Sajjanar : ప్రముఖ నటుడు అలీ భార్య జుబేదా అలీ బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ కొందరు సామాన్యులు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేశారు. ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు వారు ట్యాగ్ చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
జుబేదా అలీ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలలో కనిపిస్తున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, యువతను తప్పుదోవ పట్టించేలా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు చేయించిన సజ్జనార్.. ఇప్పుడు అలీ భార్య విషయంలోనూ స్పందించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. హర్షసాయి విషయంలో తక్షణమే చర్యలు తీసుకున్న సజ్జనార్.. ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, జుబేదా అలీపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సజ్జనార్ ఈ ఫిర్యాదులపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.