
Betting : తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ విషాదం నింపుతున్నాయి. గడిచిన ఏడాది ఈ యాప్స్ కారణంగా దాదాపు 1000 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొదట లాభాల ఆశ చూపి, ఆపై మోసగాళ్లు ముంచుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమోషన్లతో ఈ ఉచ్చు మరింత విస్తరించింది.
నెటిజన్లు వీటిని వ్యతిరేకిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సజ్జనార్ మద్దతుతో ప్రభుత్వం ప్రమోటర్లపై చర్యలకు దిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.