నియోజకవర్గ ఫోకస్: కమ్యూనిస్టుల కంచుకోట
నియోజకవర్గ ఫోకస్: ఇంతవరకు టీడీపీ, బీఆర్ఎస్ బోణీ కూడా చేయలేదు
——————————
Bhadrachalam Constituency Review : భద్రాచలం నియోజకవర్గం 1952వ సంవత్సరంలో ఏర్పడింది ఆది నుంచి కమ్యూనిస్టుల కంచుకోటగా మారింది. తెలుగుదేశం, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కసారి కూడా గెలవలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. దక్షిణ అయోధ్యగా గుర్తింపు పొందిన భద్రాచలం రాముడు కొలువైన ప్రాంతం. ఆధ్యాత్మిక ప్రాంతమైన డెవలప్ మెంట్ మాత్రం కనిపించదు. దీంతోనే ఇక్కడ ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వడం లేదు.
గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం అయినందన దీనిపై శీతకన్ను వేశారనని చెబుతుంటారు. అమాయకులైన గిరిజనుల విషయంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయనేది వాదన. ఈనేపథ్యంలో భద్రాచలంను డెవలప్ చేసే చర్యలకు పూనుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కేసీఆర్ వంద కోట్లతో భద్రాచలంపై ఫోకస్ పెడతామనే హామీ కలగానే మిగిలిపోయింది. దీంతో బీఆర్ఎస్ కు ఇక్కడి ఓటర్లు మొగ్గు చూపడం లేదు.
గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో వరద ముప్పు పొంచి ఉంటుంది. ఒక్కోసారి ఊళ్లకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. కొన్నిసార్లు విద్యుత్ సౌకర్యం కూడా ఉండదు. వేసవి కాలంలో మాత్రం రెండు నెలలు గిరిజనులకు తునికాకు సేకరణ అవకాశం ఉంటుంది. దీంతో అదే వారికి జీవనోపాధిగా ఉంటుంది. భద్రాచలంలో బీడీ పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా అది తీరడం లేదు.
భద్రాచలం నుంచి వాజేడు వరకు వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయి. వరదలు వచ్చినప్పుడు ఇక్కడి వారికి రవాణా సదుపాయాలు కష్టమే. భద్రాచలం డివిజన్ లో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 25 వేల ఎరాలకు సాగునీరు అందించే తాలిపేరు ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరందించాలని రైతులు ఆందోళన చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు.
నియోజకవర్గంలో 45 శాతం ఎస్టీ ఓట్లే ఉన్నాయి. భద్రాచలం పుణ్యక్షేత్రం విషయంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ. 90 కోట్ల వ్యయంతో పనులు చేపడుతోంది. కానీ ఇక్కడ బీజేపీ అంతంత మాత్రంగానే ఉండటంతో దానికి బలం లేదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య దే గెలుపు అని భావిస్తున్నారు.