33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Actress : రోడ్డుపైనే టిఫిన్ బండి పెట్టుకుని.. భగవంత్ కేసరి నటి పరిస్థితి చూసి అంతా షాక్

    Date:

    Actress
    Actress Tiffin Center
    Actress : సినిమాల్లో చాలా మందికి నటించాలని కోరిక ఉంటుంది. దాన్ని నిజం చేసుకోవడానికి మాత్రం ఎంతో కష్టపడుతుంటారు. సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో తాము కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వాటి కోసం ఎంత శ్రమకైనా ఓర్చుతారు. టీవీ సీరియల్స్ లో నటించిన ఝాన్సీ అనే నటి ఈ రోజు నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో రోడ్డుపై ఓ టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తోంది.

    ఆమె అనేక టీవీ సీరియల్స్ లో నటించింది. గృహ ప్రవేశం, మనసు మమత, గుప్పెడంత మనసు, నిన్నే పెళ్లాడతా, నాలుగు స్తంభాలాట, రాధమ్మ కూతురు లాంటి సీరియల్స్ లో నటించింది. ప్రేమ విమానం, ట్రెండింగ్ లవ్ స్టోరీ అనే మూవీలో కూడా నటించి మెప్పించింది. తాను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదని చెప్పే ఝాన్సీ నటనలో అదరగొట్టేది. సొంతంగానే ప్రాక్టీస్ చేసి ఈ రోజు వరకు అవకాశాలు దక్కించుకున్నానని చెప్పింది.

    అయితే తాను ఉండే పట్టణంలో వెంకటేశ్వర థియేటర్, రామ కృష్ణ థియేటర్ ఉండేదని ఆ రోజుల్లో సినిమాల్లో వచ్చే ఎక్కువ సౌండ్ విని ఎంతో ఆనందించేవాడినని చెప్పింది.   అయితే టిక్ టాక్, డబ్ స్మాష్ లాంటి యాప్స్ లలో నటించినపుడు తన యాక్టింగ్ చూసి చాలా మంది మెచ్చుకున్నారని ఆ విధంగానే సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చిందని పేర్కొంది.

    తనకు కొడుకు పుట్టిన తర్వాత ప్రాక్టీస్ పెంచడం వల్ల యాక్టింగ్ లో మెరుగుపడ్డానని చెప్పింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, చాలా ఎంకరేజ్ చేశారని అలా పరిచయాల వల్ల సీరియల్స్ లో నటించే అవకాశం రావడం జరిగిందని చెప్పింది. దీంతో వాటిలో యాక్ట్ చేసే చాన్స్ వచ్చిందని తెలిపింది. అయితే ఇక్కడ టిఫిన్ సెంటర్ ద్వారా ఆదాయం వస్తుందని, సీరియల్స్ ఎప్పటికీ ఉండేవి కావు. అవకాశాలు ఉన్నప్పుడు అక్కడ నటిస్తూ లేని సమయంలో ఇలా టిఫిన్ సెంటర్ నడిపించుకుంటూ ఉంటానని తెలిపింది.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    young actress : టాలెంటెడ్ యంగ్ యాక్ట్రెస్.. టాలీవుడ్ ఎంట్రీకి గండం.. ఆ సినిమాలు రాకుంటే అంటూ నిట్టూర్పు..

    young actress : గతేడాది తెలుగులో విడుదలైన డబ్బింగ్ చిత్రం ‘సప్త...

    Mumbai actress : ఏపీలో ముంబై నటిపై వేధింపులు.. తెర వెనుక వైసీపీ కీలక నేత

    Mumbai actress : ఏపీలో తాజాగా వెలుగులోకి వచ్చిన కేసు సంచలనం...