
గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెద వడ్లపూడిలో ” భగవాన్ శ్రీ సత్య షిర్డీ సాయిబాబా మందిరం ” ను ఏర్పాటు చేసి 17 సంవత్సరాలు కావడంతో ఆ సందర్భంగా భారీ ఎత్తున మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమాలను పాతురి నాగభూషణం దగ్గరుండి మరీ నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ, UBlood app ఫౌండర్ డాక్టర్ జై యలమంచిలి, నిర్మాత , గ్లోబల్ ఎంపర్ బ్రాడ్ కాస్టింగ్ pvt LTD అధినేత యలమంచిలి కృష్ణమూర్తి , రమేష్ బాబు యలమంచిలి , గుంటూరు జెడ్పీ మాజీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతురి నాగభూషణం, రామినేని ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడంతో పెద వడ్లపూడి గ్రామస్థులతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వేలాది మంది భక్తులు హాజరై సాయిబాబా ఆశీర్వాదం అందుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజారులు సాయిబాబాకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సాయిబాబా గుడి నిర్మాణానికి పూనుకున్న ఆనాటి పరిస్థితులను నెమరు వేసుకున్నారు భక్తులు. ఇక ఈ కార్యక్రమంలో జేడీ లక్ష్మీ నారాయణ , ఎన్నారై డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. UBlood app వంటి వినూత్న యాప్ ను డాక్టర్ జగదీష్ యలమంచిలి రూపొందించడంతో పలువురు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు జేడీ లక్ష్మీ నారాయణ కూడా ఈ యాప్ కోసం నా వంతు ప్రచారం చేస్తానని చెప్పడం గమనార్హం. భక్తులు అత్యంత భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.