Bhagwat Gita on Cloth : భగవత్ గీత అర్జునుడికి శ్రీ కృష్ణ పరమాత్ముడు చేసిన బోధనల సారం. భూమిపై మొలిచే ప్రతీ సమస్యకు ఒక్క భగవత్ గీతలో మాత్రమే పరిష్కారం ఉంటుంది. ప్రపంచంలోని ఎంతో మంది గొప్ప వ్యక్తులు భగవత్ గీతను చదివే ఇన్స్పిరేషన్ పొందారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి భగవత్ గీతను మన ప్రధాని ప్రపంచ పర్యటనకు వెళ్లినప్పుడల్లా అక్కడి అధ్యక్షులు, ప్రధానులకు అందించేవారు భారత జాతి ప్రపంచంలో తలెత్తుకొని జీవించేదిగా చేసింది భగవద్గీత అనడంలో ఎలాంటి సందేహం లేదు.
భగవత్ గీతలోని ఎన్నో స్లోకాలు ఉన్నాయి. జీవి పుట్టినప్పుటి నుంచి గతించి తిరిగి మరో శరీరం పొందే వరకు అన్ని సమస్యలకు పరిష్కారం చూపెట్టేది భగవత్ గీత మాత్రమే. అన్ని స్లోకాలను 62 సంవత్సరాల మహిళ ఒక వస్త్రంపై నేచి రికార్డు సాధించింది. ఇంతటి మహాయజ్క్షాన్ని ఏడేళ్ల నుంచి నిర్విరామంగా చేస్తూ వస్తోంది.
దిబ్రూఘర్ లోని మోరెన్ జిల్లాకు చెందిన హేంప్రభ చుటియా పట్టు వస్త్రంపై భగవద్గీత శ్లోకాలను నేసింది. సంస్కృతంలోని 700 శ్లోకాలను 150 అడుగుల వస్త్రంపై నేసింది. 4 డిసెంబర్, 2016 నుంచి ఈ మహోన్నత కార్యక్రమం చేపడుతూ వచ్చింది. ఇంతటి కీర్తి సాధించిన ఆమె మాట్లాడుతూ..
‘భగవద్గీత మన సంస్కృతి, మతం అంతర్భాగం. ఈ శ్లోకాలను ఎలాగైనా వస్త్రంపై నేయాలని సంకల్పం తీసుకున్నాను. గతంలో కూడా శంకర్ దేవ్ ‘గుణమాల’, మాధవదేవ్ ‘నామ్ ఘోష’ను కూడా గుడ్డపై నేశాను. వీటిని మ్యూజియంలో భద్రపరిచారు.’ అని హేంప్రభ చెప్పారు. హేంప్రభ బకుల్ బాన్ అవార్డు, ఆయ్ కనక్లత అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది.