హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ స్టేట్ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గుప్తా ముఖ్య అతిథిగా UBlood app ఫౌండర్ డాక్టర్ జై యలమంచిలి , సినీ, టీవీ నటి శ్రీమతి మలక్ పేట శైలజ , బోనాల ఐకాన్ తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు డాక్టర్ శ్యామల దేవి తదితరులు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.
భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలతో పాటుగా సంక్రాంతి నంది పురస్కారాలు అందించారు. కార్యక్రమం ప్రారంభంలో పిల్లల చేత చేయించిన పాటల పోటీలు , డ్యాన్స్ పోటీలు ఆహూతులను విశేషాంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో దామోదర్ గుప్తా , డాక్టర్ జై యలమంచిలి తదితరులను సన్మానించారు. UBlood app లాంటి గొప్ప సంకల్పానికి జై యలమంచిలి శ్రీకారం చుట్టడం పట్ల పలువురు అభినందనలతో ముంచెత్తారు. ప్రతీ రోజు ప్రపంచ వ్యాప్తంగా పలు సందర్భాలలో జరిగే యాక్సిడెంట్ ల వల్ల అలాగే రకరకాల ఆపరేషన్ ల వల్ల పెద్ద ఎత్తున రక్తం అవసరమౌతోంది. అయితే సకాలంలో రక్తం లభించక చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దాంతో అలాంటి ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్ లో ఎదురు కాకూడదు అనే గొప్ప సంకల్పంతో UBlood యాప్ ను రూపొందించారు డాక్టర్ జై యలమంచిలి. Ublood గొప్ప తనాన్ని వివరించడంతో సభికులు డాక్టర్ జై యలమంచిలిని అభినందనలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ , టీవీ నటి మలక్ పేట శైలజ తో పాటుగా జోగిని డాక్టర్ శ్యామాలదేవి తదితరులు పాల్గొన్నారు.