Bhola Shankar Updates :
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్న మెగాస్టార్ ఫుల్ జోష్ లోకి వచ్చాడు.. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మెగాస్టార్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నాడు..
తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ ఈ మధ్యనే పూర్తి అయ్యింది.. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ రోజు మరో సాంగ్ ను రిలీజ్ చేసారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అనే చెప్పాలి..
జం జం జజ్జనక అంటూ సాగే ఈ సాంగ్ శ్రోతలను అలరిస్తుంది.. ముఖ్యంగా మహతి స్వర సాగర్ ఈ ట్యూన్ ను కంపోజ్ చేసిన తీరు అద్భుతంగా ఉంది అనే చెప్పాలి.. మెగా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సాధారణ ఆడియెన్స్ ను కూడా ఈ సాంగ్ అలరిస్తుంది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సాంగ్ ను మంగ్లీ, కులకర్ణి ఆలపించగా యూట్యూబ్ లో ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
కాగా ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నాడు.. ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ReplyForward
|