30.1 C
India
Sunday, April 19, 2026
More

    ట్యాక్సీ డ్రైవర్ గా చిరంజీవి, మేడే సందర్భంగా ‘భోళా శంకర్’ న్యూ లుక్.. ఫుల్ కుషీలో మెగా ఫ్యాన్స్..

    Date:

    bola shankar
    bola shankar

    చిరంజీవి కార్మికుడిగా అనేక సినిమాల్లో మనకు కనిపించారు. ‘ముఠామేస్త్రీ’లో కూలిగా. ‘మెకానిక్ అల్లుడు’లో కార్మికుడిగా ‘రిక్షావోడు’లో రిక్షావాలాలా ఇలా అనేక చిత్రాల్లో నటించి అలరించారు. అదే విధంగా ఇప్పుడు కూడా కార్మికుడి పాత్రలో మనకు కనిపించబోతున్నారు. తన న్యూ మూవీ గురించి కొన్ని సన్నివేశాలను కూడా చిత్ర యూనిట్ ఈ సందర్భంగా తెలిపింది.

    మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్’లో చిరంజీవి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఆయన ట్యాక్సీ డ్రైవర్ గా కనిపించబోతున్నారట. దీనికి సంబంధించిన పోస్టర్ మేడే (సోమవారం) సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో చిరంజీవి ట్యాక్సీ వద్ద బ్లూకలర్ డ్రెస్ వేసుకొని స్టయిల్ గా నిలబడి కనిపిస్తున్నాడు. మాస్ లుక్ లో ఆయన అదరగొడుతూ టీ కప్పును పట్టుకోవడంతో మెగా అభిమానులు ఫుల్ కుష్ అవుతున్నారు. ఓ కార్మికుడిలాగా ఆయన గెటప్ ఉండడంతో ఈ మూవీలో ఆయన కార్మికుడి పాత్ర వేయబోతున్నట్లు కన్ఫమ్ అవుతుంది.

    మేడే సందర్భంగా చిరంజీవి కార్మికులకు, కర్షకులకు తన విసెష్ చెప్పారు. ఈ సినిమాలో తమన్నా చిరంజీవి సరసన హీరోయిన్ గా కనిపించబోతున్నారు. మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేశ్ నటించనుంది. తమిళంలో బిగ్ హిట్ సాధించిన ‘వేదాళం’కు రిమేక్ గా ‘భోళా శంకర్’ రూపొందుతున్నట్లు చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి. ప్రొడ్యూసర్ రామబ్రహ్మం సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ తో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Amaravati : అమరావతికి మెగాస్టార్ శోభ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమం/పునఃప్రారంభోత్సవానికి...

    Singapore : పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులను సన్మానించిన సింగపూర్ ప్రభుత్వం

    Singapore : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్...

    Chiranjeevi : పవన్‌ కుమారుడి గాయాలపై స్పందించిన చిరంజీవి

    Chiranjeevi : పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన...