
Bholashankar Teaser Mania : మెగాస్టార్ చిరంజీవి కుటుంబం సంతోషాల సమయంగా గడుపుతోంది. ఇటీవల తన ఇంట్లోకి వారసురాలు రావడంతో కుటుంబ సభ్యుల్లో నవ్వులు విరిశాయి. ఇక ఇప్పుడు భోళా శంకర్ టీజర్ రిలీజ్ చేస్తుండటంతో అభిమానులకు పండగే. ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రం టీజర్ ఈ రోజు సాయంత్రం ఆన్ లైన్ లో విడుదల కానుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
సినిమాను నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. లేటెస్ట్ గా పెట్టిన పోస్టు ఆసక్తి రేపుతోంది. భోళా శంకర్ మేనియా ఒక పర్ఫెక్ట్ ఈవెనింగ్ మెగా ఫ్యాన్స్ కు ఇస్తుంది. సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. చిరు సినిమా అంటే అందరు ఎంత ఆతృతగా ఉండటం సహజమే. వాల్తేరు వీరయ్యతో మంచి ఊపుమీదున్న చిరు ఈ సినిమాతో మరో వండర్ క్రియేట్ చేస్తారని అనుకుంటున్నారు.
అంతకుముందు గాడ్ ఫాదర్ సినిమాతో కూడా చిరంజీవి అలరించారు. ఒక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య మాత్రం నిరుత్సాహ పరచింది. అందుకే పెద్ద దర్శకులతో కాకుండా చిన్న వారితో సినిమాలు తీసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే మెహర్ రమేష్ కు అవకాశం ఇచ్చారు. ఇంకా యువ దర్శకులు మంచి కథలతో వస్తే చాన్స్ ఇస్తానంటూ ప్రకటించారు.
సినిమా పరంగా కూడా వేగం పెంచారు. ఒకే సారి రెండు మూడు సినిమాలు సెట్స్ మీద ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కథలో కొత్తదనం ఉంటే సినిమా చేయడానికి వెనకాడనని అంటన్నారు. దీని కోసమే యువతకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించనున్నారు. దీని కోసమే ఆయన పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.