
Bichagadu 2 First Review : బిచ్చగాడు సినిమా సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాతో ఒకటి రుజువు అయ్యింది.. కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాలో ముక్కు ముఖం తెలియని హీరో ఉన్నా కూడా ఆడియెన్స్ నుండి సేమ్ రెస్పాన్స్ లభిస్తుంది.. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ఎంత బాగా ఆదరిస్తారో అందరికి తెలిసిందే..
బిచ్చగాడు సినిమా మామూలుగా ఎటువంటి హంగామా లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యింది.. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు అండ్ తమిళం భాషలలో భారీ హిట్ అయ్యింది. ఆఊపు లోనే ఈ సినిమా 25 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. మరి అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు బిచ్చగాడు 2 తెరకెక్కింది..
ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో రఫ్ఫాడించడానికి రెడీ అయ్యింది.. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబందించిన ప్రివ్యూ షో రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో వేయగా అతి కొద్దీ మంది ప్రముఖులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. బిచ్చగాడు కంటే కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పుకొస్తున్నారు.
ఇక ఈ సీక్వెల్ లో విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించినట్టు తెలుస్తుంది.. ఈ సినిమాలో ఈసారి బ్రెయిన్ మార్పిడిపై జరిగే ప్రయోగం కారణంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న కోణంలో కథ సాగుతుందట.. డబ్బు, ఎమోషన్స్ చుట్టూ సాగే ఈ కథలో విజయ్ ఆంటోనీ మాత్రమే కాదు ప్రతీ ఒక్కరు జీవించారని చెబుతున్నారు. చూడాలి థియేటర్స్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో..