
Bichagadu 2 Review : బిచ్చగాడు సినిమా అంటే తెలియని ప్రేక్షకులు లేరు.. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచి కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది.. బిచ్చగాడు సినిమా ఎటువంటి హంగామా లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యింది.. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు అండ్ తమిళం బాషలలో భారీ హిట్ అయ్యింది. ఆఊటులోనే ఈ సినిమా 25 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.
మరి అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు బిచ్చగాడు 2 తెరకెక్కింది.. ఇక ఈ సీక్వెల్ లో విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించినట్టు తెలుస్తుంది.. ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. మరి బిచ్చగాడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుండగా అంచనాలను అందుకుంటుందా? మొదటి పార్ట్ ను మించి ఉందా అనే అంశాలను యూఎస్ ప్రీమియర్ చూసిన వారి రివ్యూస్ ద్వారా తెలుసుకుందాం..
ఈ సినిమా ఫస్ట్ 20 నిముషాలు ఆసక్తికరంగా సాగుతుందట.. ఈ కథలో విజయ్ ఇండియాలోనే అత్యధిక ధనవంతులలో టాప్ లో ఉంటాడు.. అయితే అతడిపై అతడి స్నేహితులు ఎలాంటి కుట్రలు చేసారు అనే విషయం ఇంట్రెస్టింగ్ గా సాగుతుందట.. ఆడియెన్స్ కు కావాల్సిన సస్పెన్స్, ఇంట్రెస్టింగ్ స్టోరీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు..
అయితే ఫస్ట్ హాఫ్ కథ సూపర్ గా ఉండగా సెకండాఫ్ మాత్రం కాస్త ట్రాక్ తప్పింది అని విజయ్ ఆంటోనీ ఎలివేషన్ సీన్స్ అతిగా ఉంటాయని అంటున్నారు. బ్రెయిన్ మార్పిడిపై జరిగే ప్రయోగం కారణంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న కోణంలో సెకండాఫ్ సాగుతుందని అంటున్నారు.. ఓవరాల్ గా అయితే విచ్చాగాడు 2 డీసెంట్ గా ఉంటుంది అని పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.. మరి ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.