white house state dinner :
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ ఏర్పాటు చేసిన విందుకు మన దేశంలోని 400 మంది ప్రతినిధులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇందులో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ సహా పలు సంస్థల సీఈవోలు ఉండటం గమనార్హం.
విందులో ఆనంద్ మహేంద్ర మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచయ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, కార్పొరేట్ దిగ్గజం ఇంద్రానూయి ఉన్నారు. మానవ హక్కుల ఉద్యమకర్త మార్టిన్ లూథర్ కింగ్ 3, టెన్నిస్ ఆటగాడు బిల్లీ జేన్ కింగ్, సినీ ప్రముఖుడు నైట్ శ్యామలన్ ఫ్యాషన్ డిజైనర్ రాల్ఫ్ లౌరెన్, వ్యాపారవేత్త ఫ్రాంక్ అస్లామ్, గ్రామీ అవార్డు గ్రహీత జాషువా బెల్ ఉన్నారు.
శ్వేత సౌధంలో ఏర్ాటు చేసిన విందులో దాదాపు అన్ని శాఖాహార వంటలే ఉండటం గమనార్హం. మన దేశంలోని చిరు ధాన్యాలకు విలువ ఇవ్వడానికి ఈ వంటకాల్లో వీటిని ఎక్కువగా వాడారు. పలు వెరైటీలు చేసి అతిథుల కోసం సిద్ధంగా ఉంచారు. యోగాతోపాటు మన పదార్థాలను కూడా మోడీ విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికాను సందర్శించే దేశాధినేతల గౌరవార్థం విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే మోడీ పర్యటన సందర్భంగా బైడెన్ ఇచ్చిన విందుతో అందరు సంతోషం వ్యక్తం చేశారు. విందులో చిరు ధాన్యాలతో తయారు చేసిన వంటకాలను పసందుగా ఆరగించారు. మొత్తానికి అమెరికా పర్యటన ఆద్యంతం ఆసక్తిగా సాగింది.






