
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యి అప్పుడే రెండు వారాలు పూర్తి కూడా అయ్యింది.. మొదటి వారం ఆడియెన్స్ కు కాస్త ఇంట్రస్ట్ గా చూసారు.. వీకెండ్ ఎపిసోడ్ కూడా నాగార్జున హోస్టింగ్ తో బాగా చేసాడు.. దీంతో ప్రేక్షకుల్లో కూడా చూడాలి అనే ఎంజాయ్ మెంట్ కనిపించింది. కానీ రెండవ వారం స్టార్ట్ అయ్యాక పరిస్థితి మారిపోయింది..
రెండవ వారం మాత్రమే కాదు వీకెండ్ కూడా చెప్పగానే సాగిపోయింది.. నాగార్జున పెద్దగా ట్విస్టులు ఏమీ ఇవ్వలేదు.. చూసే ప్రేక్షకుల్లో కూడా ఇది అసలు వీకెండ్ ఎపిసోడ్ నేనా అనే సందేహం కలిగింది.. నాగార్జున రెండవ వారం అంతగా ఫన్ జనరేట్ చేయలేక పోయాడు.. భల్లాల దేవ, కట్టప్ప అంటూ మనసులోని మాట తెలుసుకోవడం మినహా పెద్దగా ఆసక్తి కలిగించేలా ఎపిసోడ్ సాగలేదు..

పవర్ అస్త్రా పేరుతో రెండు వారాలు బాగానే ఆసక్తిగానే సాగాయి.. కానీ వీకెండ్ ను మరింత ఆసక్తిగా ఆడియెన్స్ కోరుకుంటే చప్పగా సాగింది. వీకెండ్ ఎపిసోడ్ అంటే ఎలా ఉండాలి.. ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపోయేలా ఉండాలి.. కానీ ఇందులో ఏ మాత్రం పస కనిపించలేదు. ఇక రెండవ వారంలో షకీలాను బయటకు పంపించారు.. ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపోయేలా ఉండాలి.. కానీ ఇందులో ఏ మాత్రం పస కనిపించలేదు. ఇక రెండవ వారంలో షకీలాను బయటకు పంపించారు..
ఈమె హౌస్ లో అందరికి బాగా ఫేవరేట్ గా మారిపోవడంతో ఈమె వెళ్లిపోవడం కంటెస్టెంట్స్ కు కూడా నచ్చలేదు.. హౌస్ లో ప్రతీ ఒక్కరు తమ బాధను వ్యక్తం చేయడం కాస్త ఆకట్టుకుంది. ఏది ఏమైనా వీకెండ్ ఎపిసోడ్ లా కాకుండా సాధారణ ఎపిసోడ్ లాగానే సాగిపోయింది. రోజురోజుకూ బిగ్ బాస్ అంటే బోర్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మొదట్లో మూడు సీజన్స్ లో ఉన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఇప్పుడు లేదు అనే చెప్పాలి..