Big Boss 7 Telugu :
బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వడమే కాకుండా అప్పుడే రెండు వారాలు కూడా పూర్తి అయ్యింది. సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన ఈ సీజన్ ఈసారి మరిన్ని ట్విస్టులతో ఆద్యంతం అలరించేందుకు బిగ్ బాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉల్టా పూల్టా అనే కాన్సెప్ట్ తో ఎంటర్టైన్మెంట్ ను పెంచేస్తూ ఆడియెన్స్ లో అంచనాలు పెంచేస్తున్నాడు. మరి ఇప్పుడు సీజన్ 7 మరింత రంజుగా సాగుతుంది.
ఇప్పటికే రెండు ఎలిమినేషన్స్ పూర్తి చేసుకోగా మూడవ ఎలిమినేషన్ ను సమయం ఆసన్నం అయ్యింది. శుభ శ్రీ, దామిని, గౌతమ్, యావర్, ప్రియాంక, రతికా, అమర్ దీప్ లు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్రా ఉండడంతో ఇంటి సభ్యులుగా అర్హత సాధించుకున్నారు.. ఇప్పటికే కిరణ్ రాథోడ్ మొదటి వారం షకీలా రెండవ వారం ఎలిమినేట్ అయ్యింది.
ఇక మూడవ వారం గురించి ముందు నుండి ఎలిమినేట్ అవ్వబోయేది సింగర్ దామిని అని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈమె ఓటింగ్ లో చివరిలో ఉంది. టాప్ ఓటింగ్ లో ప్రిన్స్ యావర్ ఉండడంతో ఇతడిని శనివారం ఎపిసోడ్ లోనే నాగ్ సేఫ్ చేసేసాడు. ఇక 3వ వారంలో దామిని ఎలిమినేట్ అయినట్టు బయటకు రావడంతో ఈమె ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.
అయితే సింగర్ దామిని కంటే హౌస్ లో తక్కువ ఫాలోయింగ్ ఉన్న వారు కూడా ఉన్నారు. కానీ ఈమె ఆట తీరుతో తాను ఎలిమినేట్ అయ్యేలా చేసుకుంది. ఈమె ప్రిన్స్ పట్ల ప్రవర్తించిన తీరు తోనే హౌస్ నుండి బయటకు వచ్చేసినట్టు టాక్.. ఈమె ప్రవర్తనతో ఆడియెన్స్ హార్ట్ అయ్యి ఈమెకు ఈ వారం ఓటింగ్ అసలు వేయలేదని తెలుస్తుంది.
ReplyForward
|