కానీ ఎన్ని చేసిన వచ్చిన కంటెస్టెంట్స్ మాత్రం ఆడియెన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేక పోతున్నారు.. మొదటి వారం ఎన్నో ట్విస్టులతో అలరించిన ఆ తర్వాత ఆకట్టుకోలేక పోతున్నారు.. ఇక బిగ్ బాస్ లో మొదటి వారం కిరణ్ రాథోడ్ ను ఎలిమినేట్ చేయగా.. రెండవ వారం షకీలాను బయటకు పంపించారు..
అయితే మొదట్లో ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ రోజురోజుకూ బోర్ గా మారిపోతుంది.. కంటెస్టెంట్స్ సరిగ్గా ఎంటెర్టైనమెంట్ ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏది ఏమైనా అప్పుడే బిగ్ బాస్ మూడవ వారంలోకి కూడా ఎంటర్ అయ్యి నామినేషన్స్ కూడా జరిగాయి.. నామినేషన్స్ లో సిల్లీ రీజన్స్ తో ఒకరిపై ఒకరు నామినేట్ చేసుకున్నారు.. కొంత మంది మధ్య గొడవ కూడా అయ్యింది. కాగా ప్రస్తుతం 12 మంది హౌస్ లో ఉండగా ఈసారి ౭ మంది నామినేషన్స్ లో ఉన్నారు.
శుభ శ్రీ, దామిని, గౌతమ్, యావర్, ప్రియాంక, రతికా, అమర్ దీప్ లు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్రా ఉండడంతో ఇంటి సభ్యులుగా అర్హత సాధించుకున్నారు.. ఇక వీరికి సోమవారం నుండే ఓటింగ్ పోల్ పెట్టగా ఈ వారం టాప్ లో అమర్ దీప్ ఉన్నట్టు తెలుస్తుంది..
ఇతడు 19.82 శాతంతో టాప్ లో ఉండగా యావర్ రెండవ స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ప్రియాంక, రతిక, గౌతమ్, శుభ శ్రీ, దామినిలు వరుసగా ఉన్నారు.. మరి ఈ ఓటింగ్ ను బట్టి లాస్ట్ స్థానాల్లో ఉన్న శుభ శ్రీ, దామిని లకు ముప్పు తప్పేలా లేదు.. చూడాలి వీకెండ్ లోపు ఎవరు లాస్ట్ స్థానంలో ఉంటారో ఎవరు ఎలిమినేట్ అవుతారో..