
మొదటి వారం ఎన్నో ట్విస్టులతో అలరించిన బిగ్ బాస్ చివరికి కిరణ్ రాథోడ్ ను ఎలిమినేట్ చేసాడు. ఇక ఇప్పుడు రెండవ వారం ఎలిమినేషన్ కూడా పూర్తి అయ్యింది. రెండవ వారంలో షకీలాను బయటకు పంపించారు.. అయితే మొదట్లో ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ రోజురోజుకూ బోర్ గా మారిపోతుంది.. కంటెస్టెంట్స్ సరిగ్గా ఎంటెర్టైనమెంట్ ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏది ఏమైనా అప్పుడే బిగ్ బాస్ మూడవ వారంలోకి కూడా ఎంటర్ అయ్యి నామినేషన్స్ కూడా జరిగాయి.. నామినేషన్స్ లో కొంత మంది మధ్య గొడవ కూడా స్టార్ట్ అయ్యింది. దామిని, యావర్ మధ్య గొడవ ముదిరింది.. కాగా 12 మంది హౌస్ లో ఉండగా ఏకంగా 7 మంది ఈసారి నామినేషన్స్ లో ఉన్నారు.
శుభ శ్రీ, దామిని, గౌతమ్, యావర్, ప్రియాంక, రతికా, అమర్ దీప్ లు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. గత రెండు వారాలుగా నామినేషన్స్ లో లేకుండా జాగ్రత్త పడుతున్న శుభ శ్రీ ఈసారి నామినేషన్స్ లో ఉండేలా హౌస్ మేట్స్ టార్గెట్ చేసారు.. ఇక బిగ్ బాస్ ఇక్కడ మరో ట్విస్ట్ ఇచ్చాడు..
సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్రా ఉండడంతో వారికీ ఒక టాస్క్ ఇచ్చాడు.. నామినేషన్స్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ ను సేవ్ చేయాలని, అలాగే సేఫ్ గా ఉన్న కంటెస్టెంట్స్ లోని ఒకరిని నామినేట్ చేయాలని చెప్పడంతో ముందుగా తేజ నామినేషన్స్ లో ఉండగా వీరు తేజను సేవ్ చేసి అమర్ దీప్ ను నామినేషన్స్ లోకి పంపించారు. తేజ అయితే సేవ్ అయ్యాడు. కానీ అమర్ దీప్ బుక్కయ్యాడు.. దీంతో అమర్ దీప్ కూడా సీరియస్ అయ్యాడు. కావాలనే నన్ను టారెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.