BIG BOSS 7 TELUGU :
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టా అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ అయ్యి ఊహించని విధంగా ముందుకు వెళుతుంది.. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడవ వారంలోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ కొత్త కంటెంట్ తో ఆడియెన్స్ లో అంచనాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
ఈ సీజన్ ఈసారి మరిన్ని ట్విస్టులతో ఆద్యంతం అలరించేందుకు బిగ్ బాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు. గత రెండు సీజన్స్ లలో బిగ్ బాస్ అలరించలేక పోవడంతో ఈసారి మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి రంగంలోకి దిగాడు. పవర్ అస్త్రాను గెలిచినా వారే అసలైన కంటెస్టెంట్స్ అంటూ ముందు నుండి అలానే చెబుతున్నారు. ఇప్పటికే ఆట సందీప్, శివాజీ పవర్ అస్త్రా లను గెలుచుకున్నారు.
ఇక మూడవ వారంలో బిగ్ బాస్ ఈ పవర్ అస్త్రా కోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగి పోటీని స్టార్ట్ చేసాడు.. మూడవ వారంలో ఈ పవర్ అస్త్రా కోసం అమర్ దీప్, శోభా శెట్టి, యావర్ ను ఎంపిక చేయగా మిగిలిన కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా రూమ్ లోకి పిలిచి అనర్హులు ఎవరో చెప్పాలని అడిగాడు.
దీంతో సందీప్, శివాజీ, ఈ పోటీలో ఉన్న ముగ్గురు మినహా మిగిలిన 7 కంటెస్టెంట్స్ అనర్హులు ఎవరో చెప్పారు. ముందుగా పల్లవి ప్రశాంత్, గౌతమ్, శుభ శ్రీ శోభా శెట్టి పేరు చెప్పగా ప్రిన్స్ యావర్ పేరును రతికా రోజ్, తేజ, దామిని చెప్పారు. ఇక ప్రియాంక జైన్ అమర్ దీప్, శోభా శెట్టి పేర్లు చెప్పింది. దీంతో శోభా పేరునే ఎక్కువ మంది చెప్పారు.
ఈ మొత్తం జరిగిన వ్యవహారమంతా బిగ్ బాస్ హౌస్ లో స్క్రీన్ లో ప్లే చేయగా ముందు ప్రిన్స్ ఓటింగ్ చూపించాడు. ఇక ఇది చూసిన తర్వాత అతడు కోపంతో ఊగిపోయాడు.. తన కోపాన్ని కంటెస్టెంట్స్ మీద ప్రదర్శించాడు. ఇక కోపంలో టీపాయ్ ను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇదంతా చూసిన ఆడియెన్స్ ఇతడు సైకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ కూడా యావర్ తీరు చూసి భయంతో పరుగులు తీశారు.. మొత్తానికి ప్రిన్స్ తన తీరుతో అందరిని బయపెట్టేసాడు.