Big Boss 7 Telugu :
బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి మూడు వారాలు కూడా ముగిసింది. సీజన్ 7లో ఈసారి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే వచ్చారు.. వారిలో కిరణ్ రాథోడ్ మొదటి వారం షకీలా రెండవ వారం ఎలిమినేట్ అయ్యింది. ఇక ఇప్పుడు మూడవ ఎలిమినేషన్ కూడా ముగిసింది.. నిన్న వీకెండ్ ఎపిసోడ్ జరుగగా మూడవ ఎలిమినేషన్ ను కూడా నాగార్జున ప్రకటించారు.
మూడవ ఎలిమినేషన్ లో దామినిని ఎలిమినేట్ చేయడంతో ఒక చెత్త రికార్డ్ నమోదు అయ్యింది. మరి అది ఏంటి? అనేది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే.. బిగ్ బాస్ ఇప్పటికే 6 రెగ్యురల్ సీజన్స్, 1 ఓటిటి సీజన్ పూర్తి చేసుకుంది. అయితే మొదటి మూడు వారాల్లో ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం ఇది రెండవ సారి.. 5వ సీజన్ తర్వాత ఇప్పుడు 7వ సీజన్ లో కూడా ఇలానే ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు.
5వ సీజన్ లో సరయు, ఉమా, లహరి షారిలు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లారు. ఇక ఇప్పుడు 7వ సీజన్ లో కిరణ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయ్యారు.. ఇది ఇప్పుడు చెత్త రికార్డుగా మిగిలి పోయింది.. నాలగవ వారం కూడా లేడీ కంటెస్టెంట్ నే ఎలిమినేట్ అయితే ఇది ఇండియాలోనే మరో పరమ రికార్డ్ అనే చెప్పాలి..
మరి నాగార్జున హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే ఇలా రెండు సార్లు జరిగింది.. అయితే ఈ చెత్త రికార్డ్ పై ఆడియెన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా మీమ్స్ చేస్తూ బిగ్ బాస్ ను ఏకిపారేస్తున్నారు.. వరుసగా ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ నే ఎలిమినేట్ చేయడం ఆడియెన్స్ లో చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు. మరి నాలగవ వారంలో అయితే మేల్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేస్తారో లేదంటే మళ్ళీ లేడీ కంటెస్టెంట్ నే ఎలిమినేట్ చేస్తారో చూడాలి.. ఈ ఎలిమినేషన్ పై అందరు ఆసక్తిగా ఉన్నారు.
ReplyForward
|