Sonusood :
విలన్ గా కనిపించిన మంచి మనసున్న నటుడు సోనూసూద్. కరోనా కాలంలో ఎంతో మందిని ఎన్నో విధాలుగా ఆదుకున్నారు. ఇప్పటికీ చిన్నారులకు స్కూల్స్ కట్టించడంతో పాటు కోట్లాది రూపాయలను డొనేషన్లు ఇస్తూ సేవ చేస్తున్నారు. మంచి మనస్సున్న నటుడు ఈ జనరేషన్ లో ఎవరైనా ఉన్నారంటే ఆయన సోనూసూద్ మాత్రమే అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
అమెరికాలో ఆయన ఒక కాన్సర్ట్ కు హాజరవుతున్నారు. దీంతో ఈ కాన్సర్ట్ మరింత కల సంతరించుకోనుంది. రాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆరూష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఒక బిగ్ ఈవెంట్ ను సెలబ్రేట్ చేయబోతున్నాయి. ఈ ఈవెంట్ కు సోనూసూర్ హాజరవుతున్నారు. మనోజ్ రాథోడ్, ఫిరోజ్ మహ్మద్, రాజీ మొహియొద్దీన్ ఆధ్వర్యంలో ఈ నెల (ఆగస్ట్) 26వ తేదీ శనివారం ఈవెంట్ ఉండబోతోంది. ఇందులో డీజే జై (DJ JAY) మ్యూజిక్ కూడా ఉండబోతోంది.
రాక్‌వూడ్ నైట్ క్లబ్, 600 జాక్సన్ స్ట్రీట్, డల్లాస్, టీఎక్స్ 75202లో కన్సర్ట్ ఉండబోతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కన్సర్ట్ లో ప్రధాన ఆకర్షణగా సోనూసూద్ నిలవనున్నారు. దీని గురించి మరిన్ని వివరాలకు ఫెరోజ్ మహ్మద్ 862-754-5089, రాజీ మొహియోనొద్దీన్ 815-909-0410, మనోజ్ రాథోడ్ 630-648-9053లో సంప్రదించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.