“Project K” Update :
బాలీవుడ్ లో దీపికా పదుకోన్ ముందు వరుసలో ఉన్న హీరోయిన్. ప్రస్తుతం ఆమెకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇటీవల షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాలో ఆమె కనిపించింది. ఐఎస్ఐ ఏజెంట్ రుబీనా పాత్రలో నటించి మెప్పించింది దీపికా పదుకునే. ఆమె నటనపై షారూక్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. బాలీవుడ్ బాద్ షా బిగ్ బీ లాంటి వారు సైతం ఆమెను ప్రశంసిస్తూ ఉంటారు.
ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ‘ప్రాజెక్ట్-కే’లో కూడా ఆమె హీరోయిన్ గా చేస్తుంది. ఈ అరుదైన అవకాశంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్, చిత్రీకరణకు భారీగా ఖర్చు పెడుతున్నారట మేకర్స్
దీపిక పదుకోన్ ఫస్ట్ లుక్ ను వైజయంతీ మూవీస్ ఇటీవల విడుదల చేసింది. ఆమె పోస్టర్ విడుదల కాగానే ఆమె అభిమానులు, ఫాలోవర్లు ఫిదా అయిపోయారు. ఈ ఫొటోలో నటి ఆవేశంగా చూస్తూ, కోపంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ పోస్టర్ కోసం ఆమె ‘మంచి రేపటి కోసం ఒక ఆశ వెలుగులోకి వస్తుంది’ అంటూ కాప్షన్ ఇచ్చింది. 20న యూఎస్ఏలో, 21న ఇండియాలో గ్లింప్స్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
కీలక పాత్రలో కమల్ హాసన్
ఇటీవల కమల్ హాసన్ కూడా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి రాగా ఆయన తోటి నటులు స్వాగతం పలికారు. పలు మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన విలన్ గా కనిపిస్తున్నారట. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా చెప్పారు. ఇప్పటికే బిగ్ బీ ఈ సినిమాలో నటిస్తుండగా కమల్ ఎంట్రీని అమితాబ్ స్వాగతించారు.