
Big Boss Maanas : బిగ్ బాస్ ఫేమ్ మానస్ భార్య సీమంతం ఫోటోలు వైరల్ గా మారాయి. అతడి భార్య శ్రీజ మరి కొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనుండగా.. సీమంతం ఫంక్షన్ ను గ్రాండ్ గా చేశారు. వారం క్రితమే ఈ పండగ జరగ్గా తాజాగా ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఈ బుల్లి తెర హిరోకు సీరియల్స్ నటులు, అభిమానులు, సెలబ్రెటీలు అభినందనలు తెలియజేస్తున్నారు. గతేడాది నవంబర్ లో మానస్ శ్రీజ వివాహం చేసుకున్నారు. వీరిది ఆరెంజ్ మ్యారేజ్ కాగా.. వీరి పెళ్లికి చాలా మంది సెలబ్రేటీలు హాజరయ్యారు. మానస్ మొదట్లో కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు లాంటి చిత్రాల్లో నటించాడు. బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యారు. సీరియల్స్ చూసే ప్రతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
అయితే మానస్ ను ఎక్కువగా ఫేమస్ చేసింది మాత్రం బిగ్ బాస్ సీజన్ 5 అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ 5 సీజన్ లో మానస్ మంచి ఫర్ఫామెన్స్ కనబర్చాడు. దీంతో అతడు తెలుగులో అభిమానులను సంపాదించుకున్నారు. చాలా మంది సెలబ్రెటీలు ప్రస్తుతం సీమంతం పంక్షన్లకు సంబంధించిన పోస్టులను అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా వారి కుటుంబంలో జరుగుతున్న మంచి విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుని సంబర పడిపోతున్నారు., ఇలా చేయడం వల్ల మరింత గుర్తింపు, ప్రజల్లోకి ఈజీగా వెళ్లిపోయే అవకాశం కూడా ఉంటుంది.
ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఈజీగా అందరి నోళ్లలో నానొచ్చు. మానస్ బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత కొన్ని ప్రత్యేక పాటలకు డ్యాన్స్ కూడా చేశాడు. విష్ణు ప్రియతో ఆడి పాడిన ప్రత్యేక సాంగ్ తెలుగు ఇండస్ట్రీలో సెపరేట్ ట్రెండ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులో ప్రస్తుతం సీరియల్స్ లో హిరోగా నటిస్తున్న ఈ యువ కిశోరం. వెండితెర వైపు అడుగులు వేయాలని అనుకుంటున్నాడు. మరి అతడి ప్రయత్నం సఫలం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.