
Bigg Boss fame Divi :
ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన షో బిగ్ బాస్. ఈ షో ద్వారానే చిన్న ఆర్టిస్ట్ లు కూడా ఫేమస్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. అందులో ఒకరు సొట్టబుగ్గల దివి వాద్యా. షోకు ముందు ఇండస్ట్రీలోకి వచ్చినా ఆమెకు ఏవీ కలిసి రాలేదు. బిగ్ బాస్ తోనే గ్రేట్ సెలబ్రెటీగా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలను వడ్డిస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటుంది ఈ బ్యూటీ.
తెలుగు అమ్మాయి అయిన దివి వాద్యా మోడలింగ్ లోనూ రాణించింది. ఆ తర్వాత మెల్ల మెల్లగా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్లింది. ‘లెట్స్ గో’ ద్వారా వెండితెరపైకి అరంగేట్రం చేసింది ఈ చిన్నది. దీని తర్వాత ‘సీన్ నెంబర్ 72’తో పాటు మరికొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఇవేవీ ఆమెకు కలిసి రాలేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రంలో ఓ సన్నివేశంలో కనిపించినా అది కూడా కలిసిరాలేదు.
బిగ్ బాస్ సీజన్ 4లో సాదా సీదాగానే ఎంట్రీ ఇచ్చిన దివి వాద్యా తన అందం, ఆట తీరుతో ఆకట్టుకుంది. నిజాయితీగా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోయింది. అయినా అనతి కాలంలోనే ఎలిమినేట్ అయ్యింది. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో ఒక కీలక పాత్రలో కూడా కనిపించింది. ‘నయీం డైరీస్’, ‘లంబసింగి’ వంటి సినిమాలు, ‘క్యాబ్ స్టోరీస్’, ‘మానీళ్ల ట్యాంక్’, ‘పరంపర 2’, ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్ ల్లో చేసి ఆకట్టుకుంది. జగపతిబాబు ‘రుద్రంగి’లో కూడా ఐటమ్ సాంగ్ చేసింది. ‘పుష్ప 2’లో కూడా ఓ పాత్ర చేస్తోంది.
ప్రస్తుతం కాలం కలిసి వస్తుండడంతో వెబ్ సిరీస్ లలో దూసుకుపోతున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో హాట్ పొటోలోతో రెచ్చిపోతోంది. తాజాగా వైట్ కలర్ డ్రెస్సులో కింద కూర్చొని ఘాటు ఫోజులిచ్చింది. దీంట్లో చున్నీ పక్కకు జరపడంతో దివి నాభి చూపరులను అట్రాక్ట్ చేస్తోంది. ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది.