అయితే, ఈ సినిమాకు సంగీత దర్శకుడు వశిష్ట. ఆయనకు కూడా ఇది ఫస్ట్ మూవీనే. ఈ సినిమా సమయంలోనే ‘బింభిసార 2’ కూడా ఉంటుందని, వశిష్టతో సహా, మేకర్స్ అప్పుడే ప్రకటించారు. అయితే బింభిసార 2కు జీ5 భారీ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా రూ. 100 కోట్లు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే జీ5కి ఫస్ట్ కాపీ ఇస్తే 100 కోట్లు ఇస్తాం. ఇదే డీల్ పెట్టుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ వశిష్ట తప్పుకున్నాడు. బింభిసార 2కు రొమాంటిక్ డైరెక్టర్ అనిల్ చేయనున్నాడు. అయితే డైరెక్టర్ మారినా కూడా ఆఫర్ ను మాత్రం జీ5 మార్చలేదు. కాకపోతే కథ ఇంకా సిద్ధం కాలేదు. అయితే బింభిసార టైంలోనే వశిష్ట సీక్వెల్ కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆయన వెళ్లిపోవడంతోనే పూర్తిగా కొత్త కథతో బింభిసార 2 తీయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు తగ్గ కథకోసం చిత్ర బృందం వేటలో ఉంది. అందుకే ఈ ప్రాజెక్టర్ మరింత ఆలస్యం అవుతుంది. టాలీవుడ్ లోని సమాచారం మేరకు ఆగస్ట్ లో బింభిసార 2 షూటింగ్ ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 2024 వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ReplyForward
|