Sahrdaya Foundation :
బతుకు దెరువు, ఉద్యోగం, భర్తతో పాటు దేశం కాని దేశాలకు వెళ్లి అక్కడ ఎదురయ్యే పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న వారు సహాయం కోసం అర్థిస్తారు. వారిని ఆదుకునేందుకు కొన్ని సంఘాలు, సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వస్తాయి. అందులో ఒకటే సహృదయ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ కు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గా బింధు తాడివాక ఉన్నారు. ఆమె చాలా కాలం నుంచి ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, చిన్నారులను ఆదుకుంటుంది.
భారత్ నుంచి అనేక మంది ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా అమ్మాయిలు వెళ్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంకా వివాహం చేసుకొని భర్తతో పాటు అమెరికాలో వెళ్తున్న మహిళలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భర్త పెట్టే బాధలు తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అమెరికాలో చిక్కుకుంటున్నారు.
బింధు తాడివాక ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు 50 మంది మహిళలకు ఫౌండేషన్ తరుఫున సాయం చేసింది. వారికి కావాల్సిన అవసరాలున సమకూర్చింది. ఇందులో అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న భారతీయ మహిళలు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది తల్లులు కాగా.. మిగిలిన వారు యువతులు, ప్రస్తుతం వారంతా బాగానే ఉన్నారని బింధు మీడియాకు తెలిపింది.
ఈ మహోత్తరమైన కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, TAM తెలుగు అసోసియేషన్ ఆఫ్ మేరీల్యాండ్ నిర్వాహకులు తమ ఫౌండేషన్ సహృదయకు మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చారు. వీరంతా లేకుంటే ఇంతటి కార్యక్రమం చేయలేమని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు బింధు తాడివాక.