
Bitter gourd : మనం తినే ఆహారాల్లో కాకరకాయ ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి చేదుగా ఉండే ఆహారాలతో ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో కాకరకాయ తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. రోజువారీ ఆహారంలో కాకరకాయ తీసుకోవడం వల్ల మనకు ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. కాకరకాయ చేదుగా ఉండటం వల్ల మన కడుపులోని వ్యర్థాను శుభ్రం చేయడానికి సహకరిస్తుంది.
ప్రస్తుత రోజుల్లో రక్తపోటు అందరిని బాధిస్తున్న సమస్య. ఇందులో హైబీపీ, లోబీపీ రెండు ఉంటాయి. హైబీపీ అంటే ఎక్కువగా బీపీ ఉంటుంది. లో బీపీ అంటే బీపీ తక్కువగా ఉంటుంది. ఇలా బీపీని తగ్గించడంలో కాకరకాయ బాగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో కాకరకాయతో మన ఆరోగ్యం బాగుండటానికి తోడ్పడుతుంది.
ప్రస్తుత రోజుల్లో అజీర్తి సమస్య ఎక్కువవుతోంది. తిన్నది సరిగా జీర్ణం కాకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. కాకరకాయ తినడం వల్ల అజీర్తి సమస్య తొలగిపోతుంది. కడుపులోని నులిపురుగులను తొలగిస్తుంది. ఇలా కాకరకాయ మనకు ఔషధంలా పనిచేస్తుంది. దీనిలో ఉండే చేదు గుణాలే మనల్ని అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి. కాకరకాయ జ్యూస్ కూడా తాగుతారు.
డయాబెటిస్ కు కాకరకాయ మంచిది. షుగర్ పేషెంట్లు రోజు వారీ ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవడం ఉత్తమం. దీని జ్యూస్ తాగడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. అధిక రక్తపోటుకు కూడా ఇది మంచి మందులా పనిచేస్తుంది. దీంతో దీన్ని తీసుకోవడం వల్ల అటు మధుమేహం, ఇటు రక్తపోటు కంట్రోల్ గా ఉండటం వల్ల కాకరకాయ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.