AP Alliances 2024 : బీజేపీ హెడ్ క్వాటర్స్ లో అర్ధరాత్రి దాటే వరకు సమావేశాలు జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో భేటీలు జరిపింది. ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపిక పై సుదీర్ఘ చర్చలు జరిపింది. ఏపీలో పొత్తులు స్థానా లపై చర్చ జరిగింది. చర్చలు పూర్తి కాకపోవడంతో గురువారం మళ్లీ బీజేపీ నేతలు సమావేశం నిర్వహించనున్నారు.
కోర్ గ్రూపు భేటీలో ఏపీలో పొత్తులపై బీజేపీ నేతలు ప్రస్తావించారు. రెండవ జాబితాను దాదాపు 150 మంది అభ్యర్థులతో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తొలి జాబితాలో తెలంగాణ సహా మొత్తం 195 మంది అభ్యర్థుల పేర్లు బిజెపి అధిష్టానం విడుదల చేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్లోని మిగిలిన ఎనిమిది స్థానాలపై చర్చ జరుగుతోంది.