
CM Jagan : ఏపీలో జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన వారికి ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివి రాష్ర్ట , జిల్లా స్థాయిలో ర్యాంకర్లుగా నిలచిన వారికి వీటిని అందించనున్నారు. నియోజకవర్గాల్లో టాప్ లో నిలిచిన మొదటి ముగ్గురికి రూ. 15 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలు చొప్పున అందించనున్నారు.
మారిన విద్యావ్యవస్థ..
ఏపీలోని విద్యావ్యవస్థలో సీఎం జగన్ వచ్చాక కొంత మార్పులు వచ్చినట్లు అంతా అనుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో విద్యార్థలు సర్కారు స్కూళ్ల బాట పడుతున్నారు. దీంతో ఫలితాలు కూడా బాగానే వచ్చాయి, అయితే సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు మాత్రం ఈ ప్రోత్సాహాకాలు అందుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విద్యార్థులకు నగదుతోపాటు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మార్కుల ఆధారంగా మొత్తం రాష్ర్ట వ్యాప్తంగా టెన్త్, ఇంటర్ కలిపి 3వేల మందిని సన్మానించనున్నట్లు ప్రకటించారు.
సర్కారు స్కూళ్ల గణనీయ మార్పు..
ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను గణనీయంగా మార్చారు. ఇంగ్లిష్ మీడియం విద్యావిధానాన్ని అన్ని చోట్ల అమలు చేశారు. విద్యార్థుల కోసం కూడా పలు పథకాలను అమలు చేశారు. దీంతో సర్కారు స్కూళ్లలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులను మరింత ప్రోత్సహించేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రలు స్వాగతిస్తున్నారు. తద్వారా విద్యార్థుల్లో కూడా పోటీ వాతావరణం ఉంటుందని రానున్న రోజుల్లో మరింత మంచి ఫలితాల సాధనకు ఇది ఉపయోగపడుతుందని విద్యా నిపుణులు చెబుతున్నారు.