Blockbuster sequel : గిరీష్ ఏడీ దర్శకత్వంలో నస్లెన్ కె గఫూర్, మమితా బైజు జంటగా ఈ ఏడాది (2024) ప్రారంభంలో రిలీజైన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ అద్భుత విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్లలో రూ. 136 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ ఘన విజయం తర్వాత దీనికి సీక్వెల్ మేకర్స్ అనౌన్స్ చేశారు. సీక్వెల్ ను కూడా ఫహద్ ఫాజిల్ నిర్మిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆ తర్వాత సీక్వెల్ గురించి ఎలాంటి టాక్ లేదు.
అలాగే, ప్రేమలు సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత, నస్లైన్ కే గఫూర్, గిరీష్ ఏడీ మళ్లీ కలిసి ‘ఐ యామ్ కథలన్’ అనే సినిమా చేయబోతున్నారు. ఇది కొన్ని వారాల క్రితం విడుదలైంది. ప్రేక్షకుల నుంచి సానుకూల ప్రతి స్పందనలను దక్కించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గిరీష్ ఏడీ ప్రేమలు 2 రాబోతోందని, సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ ప్రస్తుతం డెవలప్ మెంట్ లో ఉందని కన్ఫర్మ్ చేశాడు. అలాగే ఈ సీక్వెల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని, పార్ట్ 1 కంటే ఎక్కువ కామెడీ ఉంటుందని అంటున్నారు.
సీక్వెల్ గురించి దర్శకుడి నుంచి వచ్చిన ఈ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీని కోసం ఇప్పుడు జనాలు తమ అంచనాలను పంచుకుంటున్నారు. కామెడీలను బలవంతం చేయద్దని, పార్ట్ 1 లాగా సహజంగా ఉండాలని దర్శకుడిని కోరుతున్నారు. 2025 ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. మరి ప్రేమలు 2లో గిరీష్ ఏడీ నాస్లెన్ ఏం చెప్పబోతున్నారో చూడాలి.