MIX UP : ప్రేక్షుకల అభిరుచికి తగ్గట్టుగా ఓటీటీలోకి ఎన్నో సిరీస్లు, సినిమాలు వస్తున్నాయి. వాటికి మంచి ఆదరణ కూడా లభిస్తోంది. తాజాగా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. అది కూడా యూత్ఆడియెన్స్, కొత్తగా పెళ్లయిన వారిని టార్గెట్చేస్తూ వచ్చింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా రిలీజై ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఈ చిత్రం ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందామా?
ఓటీటీ ప్లాట్ఫామ్స్‌లో తెలుగులో బాగా క్రేజ్ సంపాదించుకుంది ‘ఆహా’. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు చెందిన ‘ఆహా’లో మనసును హత్తుకునే డబ్బింగ్ చిత్రాలు, సిరీస్ లుస్ట్రీమింగ్అవుతున్నాయి. తొలిసారిగా ‘ఆహా’ రూట్ మార్చింది. బోల్డ్ కంటెంట్ మూవీని డైరెక్ట్గా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. అదే ‘మిక్సప్’. ఊహించని ట్విస్ట్‌లు, లవ్, సెక్స్ప్రపంచంలోకి వెళ్లేందుకు రెడీగా ఉండండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
టీజర్ రిలీజ్
ఈ బోల్డ్ మూవీ మిక్సప్టీజర్ ఇటీవలరిలీజ్ అయ్యింది. హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలని టీజర్ ప్రారంభంలోనే సజెస్ట్ చేశారు మేకర్స్. పక్కా బోల్డ్ సీన్స్తోనే ప్రారంభం అవుతుంది కాబట్టి. కమల్ కామరాజు బెడ్ పై పడుకుంటే.. అతని భార్య కొరడాతో కొడుతూ తన కామ వాంఛ తీర్చుకుంటుంది. మూడ్ రావాలంటే ఎగ్జయిట్‌మెంట్ కావాలి.. ఎంటర్ టైన్ మెంట్ ఉండాలి అంటూ రెచ్చిపోతుంది. ‘నేను నీ మొగుడిని నాకు ఇష్టం ఉన్నప్పుడు నిన్ను ముట్టుకునే హక్కుంటుంది.’ అంటూ నటుడు ఆదర్శ్తన భార్యతో చెప్పడం చూపించారు. ‘రోజూ అదే పార్టనర్ తో చేస్తే బోర్ కొట్టదా’, ‘మ్యారెజ్ అన్నాక సెక్సువల్ సాటిఫ్యాక్షన్ అవసరం’ అంటూ టీజర్ మొత్తంబోల్డ్ కంటెంట్, బోల్డ్ డైలాగ్స్తో నింపేశారు.
ఈ టీజర్ చూసిన నెటిజన్స్ భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. తెలుగు ఓటీటీలో ఇలాంటి కంటెంట్ మూవీ అవసరమా? ‘అల్లు’ రూట్మార్చి ‘ఉల్లు (ULLU)’ కంటెంట్ వైపు మళ్లాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కన్నడ హీరోయిన్ అక్షర గౌడ హీరోయిన్గా నటిస్తుండగా.. ఆదర్శ్ బాలకృష్ణన్, కమల్ కామరాజు, పూజా జవేరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అక్షర గౌడ తెలుగులో నాగార్జున నటించిన మన్మథుడు2తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ లో దళపతి విజయ్తో తుపాకీ, అజిత్ తో ఆరంభం సినిమాలో నటించింది. రామ్ పోతినేని ది వారియర్, సుధీర్‌బాబు హరోం హరాలోనూ కనిపించింది.
Get ready to dive into the world of love, lust, and unexpected twists! 🔥🙌#MixUpOnAha from March 15, coming to spice up your love life!#MixUp #AksharaGowda @AadarshBKrishna @kamalkamaraju @IamPoojaJhave pic.twitter.com/thRUFdrxn1
— ahavideoin (@ahavideoIN) February 24, 2024