Prabhas Flop Movie : టాలీవుడ్ లో బడా బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు.. ఈయన బడా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ బాగానే కష్టపడ్డాడు.. ఇప్పుడు ఏ హీరో అందుకొని లెవల్ కు చేరిపోయాడు.. ఇతడు టాలీవుడ్ లో అందరి కంటే ముందుగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు.. బాహుబలి సినిమాతో ఈయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ వెంట బాలీవుడ్ బడా నిర్మాతలు, డైరెక్టర్లు క్యూ కడుతున్న విషయం తెలిసిందే.. మరి బాలీవుడ్ లో స్టార్ హీరోలు లేక ఈయన వెంట పడుతున్నారా? ఈయన మార్కెట్ కోసమే బాలీవుడ్ నిర్మాతలు వెంటపడుతుంటే అక్కడ కూడా స్టార్ హీరోలు ఉన్నారు.. వారు కూడా బాగానే కలెక్షన్స్ రాబడతారు కదా అనే అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది.
మరి అలాంటి వారికీ ఇప్పుడు బాలీవుడ్ ప్రొడ్యూసర్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు.. ఒక్క మాటతో ప్రభాస్ రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ప్రభాస్ గురించి అదిరిపోయే కామెంట్స్ చేసారు.. తాము ప్రభాస్ తో ఎందుకు సినిమాలు చేస్తున్నామో.. అంత ఇంట్రెస్ట్ ఎందుకో ఈయన చెప్పుకొచ్చారు..
ఈయన తాజాగా క్రేజీ కామెంట్స్ చేయగా వైరల్ అవుతున్నాయి.. ”ప్రభాస్ లోయస్ట్ మూవీ కలెక్షన్స్ = బాలీవుడ్ స్టార్ హీరో హిట్ సినిమా కలెక్షన్స్” అంటూ ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట ఇంట్రెస్టింగ్ గా మారిపోయాయి. ఈ కామెంట్స్ తో ఈయన రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పారు.. అందుకే బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేసేందుకు సుముఖత చూపిస్తున్నారు అంటూ భూషణ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ లో మంచి వైరల్ అయ్యాయి..