Boris Johnson Simplicity : చిన్న చిన్న పనులు చేస్తేనే ఎంతో గొప్పలు చప్పుకునే అలవాటు ఉండడం కామనే. కానీ ఒక దేశాన్ని ఏలిన వ్యక్తి ఎంత సామాన్యుడిగా వ్యవహరించాడో తెలిస్తే ఆశ్చర్యం కలుగకమానదు. గ్రేట్ బ్రిటన్ కు ఒకప్పుడు ప్రధాన మంత్రిగా వ్యవహరించిన బోరిక్ జాన్సన్ ట్రెయిన్ దిగి వచ్చిన తీరు చూసి సింపుల్ సిటీ అంటే ఇదే కదా అని కీర్తిస్తున్నారు. ఎంతటి గొప్ప పీటంను అధిరోహించిన వ్యక్తి అయినా జీవితంలో సింపుల్ గా వ్యవహరించడం చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు.
కేవలం వార్డు సభ్యుడిగా ఉంటేనే ఛాతి ముందకు పెట్టి గొప్పలు చెప్పుకునే కాలంలో ఆయన అంగరక్షకులు, సెక్రటరీలు కూడా లేకుండా తన సామగ్రి తనే మోసుకుంటూ ఒక స్టేషన్ లో దిగడం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఆయన గొప్ప తనాన్ని పొగుడుతున్నారు. అందుకే ఆయన గ్రేట్ బ్రిటన్ కు ప్రధాని అయ్యాడని చెప్పుకుంటున్నారు.
గ్రేట్ బ్రిటన్ లో ప్రముఖుల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఆయన చాలా సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడతారు. ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున అంగరక్షకులు, సహాయకులు లేకుండా సంచరిస్తుంటారు. ఆయనకు ఏదైనా ప్రమాదం వస్తుందోనని ఆ దేశం ప్రజలు కూడా ఆందోళన చెందుతుంటారు. కానీ ఆయన మాత్రా వీటిని పట్టించుకోరు.
ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరూ షేర్ చేస్తూ ఆయన గొప్పదనం గురించి చర్చించుకుంటున్నారు. ఆయన సింపుల్ సిటీపై వరుసగా కామెంట్లు పెడుతున్నారు.