30.1 C
India
Sunday, April 19, 2026
More

    Ap Elections : ఏపీలో వారిద్దరే కీలకం..!

    Date:

    • వైసీపీ, టీడీపీలు నమ్ముకుంది వారినే..
    • గెలుపు వాకిట నిలిపుతారని పూర్తినమ్మకం
    ap elections
    ap elections, tdp-vs-ycp
    Ap elections : ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇందు కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపునకు కావాల్సిన అన్ని రకాల ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఓటర్ల నాడినితమ వైపు తిప్పుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లన్ని చేసుకున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ లెవల్ వర్క్ ను తమ టీమ్ లకు అప్పగించాయి. అయితే ఏపీలో రెండు ప్రధాన పార్టీలు ఒక ఇద్దరిని నమ్ముకొని ముందుకు సాగుతున్నాయి. ఓటర్ల కంటే వారిద్దరే తమ గెలుపును నిర్ణయిస్తారనే రీతిలో విశ్వాసం ఉంచుతున్నాయి.


    ఎవరా.. ఇద్దరు

    అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ఈ సారి గెలవడం తప్పనిసరి. రెండు పార్టీలకు ఇది చావో రేవో. ఓడితే టీడీపీని వైసీపీ లేవకుండా చేస్తుంది. ఒకవేళ టీడీపీ గెలిస్తే వైసీపీ పై ఈ ఐదేళ్ల దాడులకు ప్రతీకారం తీర్చకుంటుంది. తద్వారా జగన్ కు కోలుకోని దెబ్బ కొడుతుంది. ఇప్పటికే పలు కేసులతో సతమతమవుతున్న జగన్ ను జైలు కే పరిమితం చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అందుకు ఈ సారి గెలుపును రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే ఓ ఇద్దరికి ఈ బాధ్యతలు కట్టబెట్టాయి. వైసీపీ ప్రశాంత్ కిశోర్ కు, టీడీపీ సునీల్ కనుగోలుకు.

    వీరి వ్యూహం ఫలిస్తుందా..

    ప్రశాంత్ కిశోర్.. ఇప్పటికే వైసీపీని 2019 ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చిన వ్యూహకర్త. తన టీంతో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాడంటే ప్రత్యర్థి వణకాల్సిందే. ఈయన మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్ఫుడూ జగన్ కు అందజేస్తు్న్నాడు. అన్ని నియోజకవర్గాల్లో తనటీం ద్వారా సర్వే చేయించి, పార్టీ పరిస్థితిని అధినేతకు చేరవేస్తున్నాడు. బలహీనతలు, బలాలు గుర్తిస్తూ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో వివిధ పార్టీలకు విజయాన్ని అందించిన సక్సెస్ రేట్ ప్రశాంత్ కిశోర్ ఖాతాలో ఉంది. తెలంగాణలోనూ ఈయన ఓ ప్రధాన పార్టీ కి పని చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఏపీలో 2019లో టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టడంలో ప్రశాంత్ దే కీలక పాత్ర. పీకే ఎంట్రీ ఇస్తే అక్కడ విజయం కచ్చితమనే స్థాయికి ఆయన ఇమేజ్ పెరిగింది. మరి 2024 ఎన్నికల్లో పీకే యంత్రం పని చేస్తుందా.?

    రెండో వ్యక్తి సునీల్ కనుగోలు

    ఈయన కూడా తక్కువేం కాదు. తన టీంతో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాడంటే ప్రత్యర్థులకు ముచ్చెముటలే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాంతాల్లో సునీల్ కనుగోలు కే వ్యూహాల బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లోనూ ఆయన పనిచేశారు. తెలంగాణ కాంగ్రెస్కు కూడా ఈయన టీమే పని చేస్తున్నది. ఇక ఏపీలో టీడీపీ గెలుపునకు సునీల్ శ్రమిస్తున్నారు. ఇటు అధినేత, అటు యువనేత లోకేశ్ తో టచ్ లో ఉంటూ పార్టీ పరిస్థితిని తెలియజేస్తున్నాడు. క్షేత్రస్థాయిలో ఈయన టీం ఇప్పటికే పని మొదలు పెట్టింది. సోషల్ మీడి యా ద్వారా అధికార పార్టీ బలహీనతలను బయటపెడుతున్నది. , అభ్యర్థుల ఎంపిక, గెలుపు గుర్రాలు తదితర సర్వేలను ఇప్పటికే చేపట్టింది. అయితే సొంత రాజకీయ చతురతతో ముందుకు సాగే చంద్రబాబు ఈ సారి సునీల్ కనుగోలును నమ్ముకోవడం విస్మయానికి గురి చేస్తున్నది.

    ఓటర్ల నాడే కీలకం

    ఏపీలో గెలవాలంటే ఓటర్ల నాడి పట్టుకోవడమా.. వారిని తమవైపు తిప్పుకోవడమో కీలకం. అయితే ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలు అదే చేస్తున్నాయి. ఈ రెండు టీమ్ లు సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా తమ ప్రచారాన్ని ఇప్పటికే మొదలుపెట్టాయి. ఆయా పార్టీలకు అనుగుణంగా గెలుపు తలుపులు తెరుస్తు్న్నాయి. గ్రౌండ్ లెవల్ లో వర్క్ చేస్తూ పార్టీల గెలుపులో కీలకంగా పని చేస్తున్నాయి. అయితే ఈ సారి పోటీ చంద్రబాబు, జగన్ ల మధ్య మాత్రమే కాదు.. సునీల్, ప్రశాంత్ ల మధ్య అని కూడా వినిపిస్తున్నది. ఇంతకీ ఏపీ ప్రజలు ఎవరివైపు నిలుస్తారో మరో ఏడాదిలో జరిగే ఎన్నికల్లో తేలనుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    Chandrababu : ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు సంచలనం

    Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో కీలక ప్రకటన చేశారు. అలిపిరిలో...