
Boyapati-Pawan combination : తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్ల గురించి ప్రేక్షకులు కలలు కంటారు. కానీ అది కొన్ని సార్లు సాధ్యం కాదు. మాస్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. బాలకృష్ణకు మాస్ హిట్లు ఇచ్చిన అతడితో పవన్ కల్యాణ్ కాంబినేషన్ బాగుంటుందని అందరు అనుకోవడం సహజమే. వీరి కాంబినేషన్లో ఓ సినిమా వచ్చేది. అన్ని కుదిరితే వీరి కాంబినేషన్ కూడా మాస్ ను ఆకట్టుకునేది.
దీని కోసం నిర్మాత డీవీవీ దానయ్య పవన్ తో మాట్లాడి ఓ సినిమా తీద్దామని ప్లాన్ చేసుకున్నారు. బోయపాటి శ్రీను వద్ద మంచి కథ ఉందని దాన్ని పట్టాలెక్కిస్తామని అనుకున్నారు. అంతా రెడీ అయ్యారు. ఇక శ్రీనును పిలిచి కథ విన్నారు. కానీ ఆ కథ ఎందుకో పవన్ కు నచ్చలేదు. దీంతో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించాడు.
దీంతో శ్రీను మరో కథ రెడీ చేశారు. ఇంతలోనే పూరీ జగన్నాథ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా షూటింగ్ ప్లాన్ చేసి పట్టాలెక్కించారు. దీంతో వీరి కాంబినేషన్ కు రూపుదాల్చడం కుదరలేదు. అన్ని అనుకున్నట్లు ఉంటే బాలయ్యకు మాదిరి పవన్ కు కూడా ఓ సెన్సేషనల్ సినిమాను అందించేవాడు శ్రీను. కానీ కొన్ని ఎందుకో వర్కవుట్ కావు.
ఇలా సినిమాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఒకరి కోసం అనుకున్న కథను మరొకరు చేయడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పవన్, బోయపాటి కాంబినేషన్ ఇక కుదరడం లేదు. ఏదైనా వాయిదా పడితే అది సెట్ కావడం అంత సులభం కాదు. మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే కుదిరితేనే ముందుకు సాగుతుంది. లేకపోతే అది పట్టాలెక్కడం సాధ్యం కాదు.