Boyfriend : వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తాయని మరోసారి నిజం అని తేలింది. దొరికే వరకు దొరతనంగానే కొనసాగిన రంకు.. విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు జైలుకు ప్రియురాలు కనిపించకుండా పోయింది. ఈ ఘటన గురించి తెలిస్తే నిజంగా షాక్ కావాల్సిందే. వివరాలు చూద్దాం..
తమిళనాడు రాష్ట్రంలోని, తిరుచ్చి జిల్లాకు చెందిన, తిరువెరుంపూర్ మండలం, కుమరేశపురంలో మరియమ్మన్ కోవిల్ వీధిలో శరవణన్ (45) నివసిస్తున్నాడు. ఆయనకు భార్య సౌందర్య వల్లి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యక్తి రిత్యా శరవణన్ ఎలక్ట్రీషియన్. ఇద్దరు కూతుళ్లు తోచినపని చేసుకుంటుండగా, మూడో కూతురు ఇంకా చదువుకుంటుంది.
శరవణన్-సౌందర్యవల్లిది లవ్ మ్యారేజ్. కుటుంబ పోషణ కోసం 8 సంవత్సరాలుగా తిరువెరుంపూర్ లోని పంథాల్ అనే కంపెనీలో పని చేస్తుంది. అదే కంపెనీకి మేనేజర్ గా ఉన్నాడు రాధాకృష్ణన్(52). ఆయన తన భార్యకు విడాలకులు ఇచ్చాడు. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటూ కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న సౌందర్య వల్లికి ఆయనకు మధ్య వివాహేతర బంధం కలుస్తుంది.
భర్త శరవణన్‌కు తెలియకుండా ప్రియుడు రాధాకృష్ణన్ తో కలిసి కంపెనీకి చెందిన గెస్ట్ హౌజ్ లో అప్పుడప్పుడూ సుఖ పడుతున్నారు ఇద్దరూ. సౌందర్య వల్లి తనకు స్వర్గం చూపుతుండడంతో ఆమెకు కూడా తృప్తి కలిగేలా కావాల్సింది ఇస్తున్నాడు రాధాకృష్ణన్. కొన్ని రోజులకు భర్తకు విషయం తెలిసింది. ఇద్దరినీ గట్టిగా మందలించాడు. ఈ విషయంపై కాపురంలో తరుచూ కలతలు రావడం ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో గత వారం సౌందర్యవల్లి తన చివరి కూతురుతో కలిసి చెన్నై వెళ్లింది. ఇంట్లో శరవణన్ మాత్రమే ఉన్నాడు. ఆయనను కూల్ చేసేందుకు రాధాకృష్ణన్ ఇంటికి వచ్చి మద్యం తాగించాడు. ఆయన కూడా తాగాడు. మత్తులో ఉండగా తన భార్యను కలవద్దని తీవ్రంగా హెచ్చరించాడు. కోపోద్రిక్తుడైన రాధాకృష్ణన్ శరవణ్ తలను గోడకు ఆనించి కత్తితో పొడిచి చంపాడు. అక్కడికక్కడే శరవణన్ చనిపోయాడు. విషయం తెలుసుకున్న తిరువెరంపూర్ పోలీసులు శరవణన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించారు.
రాధాకృష్ణన్ పోలీసులకు లొంగిపోగా.. బయటకు వెళ్లిన సౌందర్యవల్లి భర్త అంత్య క్రియలకు కూడా రాలేదు. దీనిపై శరవణన్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు