Gopichand Bhimaa : విలన్ గా ఎంత మెప్పించాడో.. హీరోగా కూడా అంతకంటే మెప్పించాడు మ్యాచో స్టార్ గోపీచంద్. గతంలో గౌతమ్ నందలో ఆయన రెండు రకాల పాత్రలు ధరించారు. ఇప్పుడు మరో సినిమాలో డ్యూయల్ రోల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ నంద గోపీచంద్ కు భారీ బ్రేక్ ఇవ్వగా.. ఈ సారి కూడా అంతకంటే ఎక్కువ హిట్ అవుతుందని అభిమానులతో పాటు ప్రతీ ఒక్కరూ భావిస్తున్నారు.
మ్యాచో స్టార్ గోపీచంద్ తన తాజా చిత్రం ‘భీమ’లో రెండు విలక్షణమైన పాత్రల్లో కనిపించనున్నాడు. హర్ష దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరిగింది.
దర్శకుడు ఏ హర్ష మాట్లాడుతూ ‘యాక్షన్, మాస్, కామెడీ వంటి కమర్షియల్ అంశాలు భీమలో చిత్రంలో ఉన్నాయన్నాడు. కథ అందరినీ మెప్పిస్తుందని చెప్పాడు. భీముడు అనే టైటిల్ లోనే మాస్ ఉంది. గోపీచంద్ గొప్ప మనిషి. సరిగ్గా ఏడాది క్రితం మార్చి 3న ఈ సినిమా ప్రారంభోత్సవంతో ప్రారంభమైంది. గోపీచంద్ చిరునవ్వు చూస్తే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గోపీచంద్ లో బ్రహ్మ రాక్షసుడిని చూస్తారు. భీమా కచ్చితంగా థియేట్రికల్ మూవీ అని, ఓటీటీ వెర్షన్ కోసం వెయిట్ చేయొద్దని అన్నారు.
గోపీచంద్ మాట్లాడుతూ ‘భద్ర (వర్షంలో పాత్ర పేరు) గా నాకు అద్భుతమైన ప్రేమ లభించింది, భీమ పట్ల కూడా అదే ప్రేమ నాకు లభిస్తుందని ఆశిస్తున్నాను. షూటింగ్ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ క్షణాన్ని బాగా ఎంజాయ్ చేశాను. మీకు కొన్ని ఉన్నత క్షణాలు ఉంటాయి. రాధామోహన్ గారితో మరో సినిమాకు సైన్ చేశాను. రవి బస్రూర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయి’ అన్నారు. మార్చి 8 శివరాత్రికి ‘భీమా’ విడుదల కానుంది.