Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చాలా మందికి తెలుసు. భవిష్యత్తులో ఆయన ప్రస్తావించిన ఎన్నో సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యంగా మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. వర్తమానంలో ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు కనిపిస్తున్నాయి. అయితే బ్రహ్మగారు చెప్పినట్లు భవిష్యత్తులో యుగాంతం ఎప్పుడు జరుగుతుందో అని కొన్ని విషయాలు క్రోడీకరించారు. బ్రహ్మం గారి లెక్కల ప్రకారం యుగాంతం 2025 లో జరుగుతుందని అంటుంటారు. అంతకు ముందే కొన్ని ధరిత్రి అంతానికి సూచనలు స్పష్టంగా కనిపిస్తాయట. నిజానికి బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకే సారి చెప్పలేదు. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు సార్లు చెప్పారు. అంతే కాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతి పెట్టారు. దాని మీద చింతచెట్టు కూడా వచ్చింది. ఆయన దానిని ఎందుకు పాతిపెట్టారనే దానికి ఇప్పటి వరకు జవాబు లేదు. ఇక ఆయన చెప్పినట్లు రాచరికాలు, రాజుల పాలన నశించాయి. ఒక అమ్మ 16ఏళ్లు పాలిస్తుందని ఇందిరా గాంధీ పరిపాలన గురించి ఆయన ఆనాడే చెప్పారు. బ్రాహ్మణ అగ్రహారాలు నశించి పోతాయన్నారు. 100ఎకరాల్లో గతంలో బ్రహ్మనులకు అగ్రహారాలు ఉండేవి.
బ్రహ్మంగారి కాలగణన ప్రకారం 2024 సంవత్సరం ప్రారంభం నుండి కొన్ని విషయాలు ఇప్పటికే జరిగాయి. ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్లు కొన్ని విషయాలు నిజమయ్యాయి. జనాభా విపరీతంగా పెరుగుతుందని.. అడవుల్లో నివసించే జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తీస్తాయని అంటున్నారు. అంతేకాదు ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలు తెలుసుకుంటే వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరుగుతాయన్నారు. అంతేకాదు వ్యవసాయ భూములు బీడుగా మారి పంటలు సరిగా పండక తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందన్నారు. ప్రజలు తీవ్ర ఆకలితో అలమటిస్తారని బ్రహ్మంగారు వెల్లడించారు. పండ్లు వాటి రుచిని కోల్పోతాయి. శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని వెల్లడించారు. ప్రజలు మంచం మీద పడుకుని, రక్తం గడ్డకట్టడం వల్ల చనిపోతారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రకరకాల కారణాలతో మూగ జీవాలు చనిపోతాయని.. అంతేకాదు రాజ్యాధికారం కోసం దేశాలు ఆధిపత్య పోరు.. లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని వెల్లడించారు.
ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ… చావు పుట్టుకలను మాత్రం మనిషి ఆపలేడని చెప్పారు. సృష్టిని మార్చుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. చనిపోయిన వారిని బతికించుకునేందుకు, మనిషిని పుట్టించే యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుక్కోలేరని చెప్పారు. మరి ఆయన చెప్పింది నిజయే మనషిని పోలిన మర మనిషిని సృష్టించగలిగాడు కానీ.. మనిషిని మాత్రం సృష్టించలేకపోయాడు. వావి వరుసలు లేకుండా మృగాళ్లా మనుషులు ప్రవర్తిస్తారని చెప్పారు. ప్రస్తుతం సమాజంలో అలాగే జరుగుతుంది. 2023లో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని తెలిపారు. అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. చైనా భారత్ ను మిత్రత్వం అనే వంచన చేసి దెబ్బతీయాలని ఎన్నో సార్లు చూసింది. వెర్వేరు చక్రాల వాహనాలు ఢీకొంటాయని చెప్పారు. అలాగే ఒడిశాలో భారీ రైలు ప్రమాదం, ఏపీలో రైలు ప్రమాదాలు జరిగాయి. భవిష్యతులో కొత్తవి కోవిడ్ కంటే భయంకరమైనవి వచ్చి జనజీవితాన్ని అస్తవ్యస్తం చేయనున్నాయి. 2025లో బ్రహ్మంగారు ఏం చెప్పారో చూద్దాం. పంటలు సరిగా పండక, పాడిపశువులు సరిగాపాలివ్వక కరువు తాండవిస్తుందని చెప్పారు. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వాళ్లు ధర్మాలు వదిలి వేరే ధర్మాలు పాటించి నాశనం అవుతారు. కాశీలో గంగ కనిపించకుండా మాయం అయిపోతుంది. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. పట్టపగలు ఆకాశం నుంచి పిడుగుల వాన పడి కొందరు మరణిస్తారు. భయంకరమైన తుఫాను, వరదల వల్ల పశ్చిమ బెంగాల్ లో కోట్ల మంది దుర్మరణం పాలవుతారని చెప్పారు. భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది. 2041సంవత్సరంలో కోట్లాది మంది హతమవుతారని బ్రహ్మంగారు తెలిపారు.