
Brahmanandam Daughter in Law : టాలీవుడ్ లో లెజెండరీ కమెడియన్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అని.. ఈయన సినిమాల్లో ఎంతగా మెప్పించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన బ్రహ్మానందం అంటే ఇష్టపడని ఆడియెన్స్ లేరు.. అంతగా ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
మరి గత కొంత కాలంగా బ్రహ్మానందం గారు ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన నటించిన చివరి సినిమా రంగమార్తాండ.. దీని తర్వాత మరో సినిమాలో కనిపించలేదు.. ఇదిలా ఉండగా బ్రహ్మానందం ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి..
ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక నిన్న ఆదివారం ఘనంగా జరుగగా సినీ బంధు మిత్రులు హాజరయ్యారు.. ఈయన చిన్న కుమారుడు వివాహం డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తెతో జరగనుంది.. ఈమె కూడా డాక్టర్ అని తెలుస్తుంది..
ఇదిలా ఉండగా బ్రహ్మానందం కోడలుకు నిశ్చితార్ధ వేడుకలో కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.. కోడలికి బ్రహ్మానందం డైమెండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారట.. దీని విలువ బాగానే ఎక్కువ అని తెలుస్తుంది.. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..