Pushpa – 3 : పుష్ప 3 గురించిన ఓ సంచలన వార్త ఆన్‌లైన్‌లో లీక్ అయింది. పుష్ప-2 ఫైనల్ మిక్సింగ్ సందర్భంగా సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి చేసిన పోస్ట్‌లో, పుష్ప సీక్వెల్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లుగా కనిపించేలా బ్యాక్‌గ్రౌండ్‌లో స్క్రీన్‌పై “పుష్ప – 3 ది ర్యాంపేజ్” లోగోతో పోస్టర్‌ను రూపొందించారు. అదే సమయంలో, పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్, పుష్ప 2: ర్యాంపేజ్ అంటూ దర్శకుడు సుకుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. అంటే పుష్ప 3 ఉందని విజయ్ చేసిన ట్వీట్‌ను నెటిజన్లు రీట్వీట్ చేశారు. పుష్ప 3 ఫోటో వైరల్ కావడంతో వెంటనే తప్పు తెలుసుకున్న సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టి ఆ ఫోటోను తొలగించారు. అయితే ఇది ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ కంటిన్యూషన్ ఎప్పుడొస్తుందో రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Breaking News
Pushpa – 3 : బ్రేకింగ్ : పుష్ప – 3 కూడా ఉందట… సినిమా పేరేంటో తెలుసా??*
Date: