Bride in bikini : పెళ్లి కూతురంటే సంప్రదాయ దుస్తుల్లో చూడముచ్చటగా రెడీ అవుతుంది. వరుడు తరుపు వారంతా పెళ్లి కూతురు ఎలా ఉంటుందా? అని చూసేందుకు ఆసక్తిని చూపుతుంటారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం పెళ్లి కూతుళ్ళు మాత్రం వైరటీ వైరటీ దుస్తుల్లో కన్పిస్తున్నారు. వచ్చిన అతిథులు మూర్చబోయేలా చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో..
పెళ్లి వేడుక ఊరేగింపు సమయంలో పెళ్లి కూతుళ్లు ఏకంగా ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావ’ అంటూ ఐటమ్ సాంగులకు డాన్సులు చేయడం కూడా కన్పిస్తోంది. ఇదిలా ఉంటే ఓ పెళ్లి కూతురు ఏకంగా పెళ్లి మండపంలోకి బికినితో వచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది. పెళ్లి కూతురు సంప్రదాయ దుస్తుల్లో వస్తుందనుకుంటే వారందరీ అంచనాలను తలకిందులు చేస్తూ బనారాస్ బికినీతో వచ్చింది.
పెళ్లికి ముందే వధువు వరుడుతోపాటు వచ్చిన అతిథులందరికీ ఫ్రీ షో చూపించడంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వరుడికి అసలు సినిమా ముందుందనే కామెంట్స్ పెడుతున్నారు. అమ్మాయిలు వేసుకునే డ్రెస్సు వారి వ్యక్తిగత విషయం అయినప్పటికీ సంప్రదాయ రీతిలో జరుపుకునే పెళ్లి వేడుకలో వధువు బికినీలో రావడంపై పలువురు అరే.. ఏంట్రా ఇది.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయమెంటో కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి.
View this post on Instagram