
Speechless : మనది భక్తి ప్రధానమైన దేశం. అందుకే మనం అన్నింటిని పూజిస్తుంటాం. చెట్టు, పుట్ట, జంతువులతోపాటు దేవుళ్లను కొలుస్తాం. మనం పూజించే చెట్లలో రావి చెట్టు ప్రధానమైనది. దీంతో ఎన్నో లాభాలున్నాయని ఆయుర్వేదంలో చెబుతారు. దీంతో రావి ఆకులతో మనకు ఎంతో మేలు కలుగుతాయి. కోయిల దీని చిగుళ్లు తిని ఎంత తియ్యగా పాడుతుందో తెలుసు కదా. ఇలా రావి ఆకులతో మనకు కలిగే మేలు గురించి తెలుసుకుంటే ఆశ్చర్యమే.
రావి ఆకుతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది. వాంతులు, విరేచనాలకు మందుగా ఉపయోగపడుతుంది. మూత్ర సంబంధమైన వ్యాధులను దూరం చేస్తుంది. కామెర్లకు కూడా మందులా వాడతారు. ఇందులో శ్రీమహా వష్ణువు ఉంటాడని నమ్ముతారు. చిన్న పిల్లలకు మాట రాకపోతే (speechless) దీన్ని తింటే మంచి ఫలితం వస్తుందని చెబుతారు.
రావి ఆకుతో మంచి స్వరం వస్తుంది. కోకిల ఈ ఆకు తినడం వల్లే తన గొంతుకు అంతటి తియ్యదనం వస్తుందని అంటారు. ఇలా రావి చెట్టుతో మనకు ఎన్నో లాభాన్నాయి. వారంలో శనివారం రోజైనా రావి చెట్టును పూజించాలి. దానికి నీళ్లు పోసి ప్రదక్షిణలుచేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇలా రావి వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు కలిగి ఉంది.
రావి చెట్టు ఆకుతో మాటలు రాని పిల్లలకు తినిపించినట్లయితే మాటలు వస్తాయంటారు. అంటే రావి ఆకు వల్ల ఇంతటి మహత్తర శక్తి దాగి ఉంటుంది. ఇంకా ఆకుపై ఓంకారం, స్వస్తిక్ గుర్తు రాసి డబ్బులు దాచుకునే చోట పెట్టుకుంటే మంచి ఆదాయం కలుగుతుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ఇలా రావి ఆకు వాడుకుని మంచి యోగాలు పొందాలని సూచిస్తున్నారు.